ETV Bharat / state

నేడు రామోజీరావు సంస్మరణ సభ - ముఖ్య అతిథిగా హాజరుకానున్న చంద్రబాబు - Ramoji Rao Samsmarana Sabha

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 6:45 AM IST

Updated : Jun 27, 2024, 7:28 AM IST

Media Mogul Ramoji Rao Samsmarana Sabha Arrangements: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేసింది. రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. మొత్తం 21 మంది అతిథులు వేదికపై ఆశీనులుకానున్నారు. ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Media Mogul Ramoji Rao Samsmarana Sabha Arrangements
Media Mogul Ramoji Rao Samsmarana Sabha Arrangements (ETV Bharat)

Media Mogul Ramoji Rao Samsmarana Sabha Arrangements : కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప-ఎనికెపాడు 100 అడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్‌లో అక్షరయోదుడు రామోజీరావు సంస్మరణ సభ కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమం ఏర్పాట్లును మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, రామానాయుడు, నాదెండ్ల మనోహర్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికారులతో కలిసి పరిశీలించారు.

రామోజీరావు విశిష్ట సేవలకు గుర్తింపు : ఈనాడు పత్రికతో పాటు ఈటీవీ చానెళ్లతో రామోజీరావు మీడియాలో కొత్త ఒరవడి సృష్టించారు. మధ్య తరగతి ప్రజలకు మార్గదర్శితో ఆర్థిక భరోసా కల్పించారు. ఉషా కిరణ్‌ మూవీస్‌ ద్వారా సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలు అందించారు. ప్రపంచంలోనే అరుదైన రామోజీ ఫిలింసిటీ ద్వారా గిన్నస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రకృతి విపత్తుల్లోనూ ప్రజలకు వెన్నంటే నిలిచారు. రామోజీరావు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం సంస్మరణ సభను నిర్వహిస్తోందని మంత్రులు తెలిపారు.

రామోజీరావు సంస్మరణ సభ కోసం పటిష్ట బందోబస్తు : మంత్రి కొలుసు - Kolusu on Ramoji Memorial Service

అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు : రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిధిగా సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు కూడా వస్తుండటంతో మంత్రుల కమిటీ పర్యవేక్షణలో ప్రధాన వేదిక, మూడు తాత్కాలిక భారీ గుడారాలను ఏర్పాటు చేశారు. దాదాపు 10వేల మంది వరకు కుర్చునేందుకు వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. మొత్తం 21 మంది అతిథులు వేదికపై ఆశీనులు కానున్నారు.

ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ది హిందూ మాజీ ఎడిటర్‌ ఎన్‌.రామ్, రాజస్థాన్‌ పత్రిక ఎడిటర్‌ గులాబ్‌ కొఠారి, ఈనాడు ఎండీ కిరణ్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ప్రముఖ సినీ నటులు హాజరుకానున్నారు. కానూరు రోడ్డులో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యి మంది పోలీసులను నియమించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ ఏర్పాట్లలో ఎక్కడా అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

రాష్ట్ర కార్యక్రమంగా రామోజీరావు సంస్మరణ సభ - హాజరుకానున్న సీఎం, కేంద్రమంత్రులు - Arrangements for Memorial Service

ప్రజలు ప్రత్యేక ఆహ్వానితులు : రామోజీరావు సంస్మరణ సభ కోసం స్వగ్రామం కృష్ణా జిల్లా పెదపారుపూడి ప్రజలు ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. వీరి కోసం పెదపారుపూడి గ్రామానికి 3 బస్సులు, మండలానికి మరో 3 బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

రామోజీరావు పేరు మీద జర్నలిస్టులకు విశిష్ట అవార్డులు - ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు - MP ON RAMOJI AWARDS TO JOURNALISTS

Last Updated : Jun 27, 2024, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.