ETV Bharat / state

ఫిల్మ్‌ మేకర్ కావాలనుకుంటున్నారా? - అయితే ఇప్పుడే 'రామోజీ ఫ్రీ ఫిల్మ్​ మేకింగ్​ కోర్సు'ల్లో చేరండి - RAMOJI FREE FILM MAKING COURSE - RAMOJI FREE FILM MAKING COURSE

Ramoji Academy Free Filmmaking Courses : రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్ (ఆర్‌ఏఎం) ప్రముఖ భారతీయ భాషల్లో ఉచిత ఫిల్మ్ మేకింగ్ కోర్సులను ప్రకటించింది. ఫిల్మ్‌ మేకింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించాలనుకునే విద్యార్థులకు ఈ ఫ్రీ కోర్సు ద్వారా ఓ సువర్ణావకాశాన్ని కల్పించింది. ఇంతకీ ఈ అవకాశాన్ని ఎలా పొందాలనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి.

Ramoji_Academy_Free_Filmmaking_Courses
Ramoji_Academy_Free_Filmmaking_Courses
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 11:40 AM IST

Ramoji Academy Free Filmmaking Courses : ఫిల్మ్ మేకర్ కావాలని కలలు కంటున్నారా? పరిశ్రమలోని అత్యుత్తమ వ్యక్తుల నుంచి కళను నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇది మీరు ఎదురుచూస్తున్న క్షణం కావచ్చు. రామోజీ ఫిల్మ్ సిటీలో(Ramoji Film City) ఉన్న రామోజీ గ్రూప్ డిజిటల్ ఫిల్మ్ అకాడమీ అయిన రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్ (ఆర్‌ఏఎం) ఇప్పుడు ఆ అవకాశాన్ని మీకోసం ఉచితంగా కల్పిస్తుంది. మరి ఇంకెెందుకు ఆలస్యం. ఆ వివరాలేంటో తెలుసుకోండి.

రామోజీ గ్రూపు సంస్థలకు చెందిన రామోజీ అకాడమీ ఆఫ్‌ మూవీస్‌ (ఆర్‌ఏఎం) తెలుగు సహా బహుళ భారతీయ భాషలలో ఉచిత ఫిల్మ్ మేకింగ్ కోర్సులను అందించనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో ప్రకటించింది. ఈ కోర్సులను ఆన్‌లైన్‌ ద్వారా ఫ్రీగా అందించనున్నారు. ఇందులో భాగంగా కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌, యాక్షన్‌, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌, ఫిల్మ్‌ ఎడిటింగ్‌, డిజిటల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌(Digital Filmmaking) లాంటి కోర్సుల్లో ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు. కనీస వయసు 15 సంవత్సరాలు, ఎంచుకున్న లాంగ్వేజ్‌లో నైపుణ్యం కలిగి ఉన్నవారు ఈ కోర్సులకు అర్హులు.

చెన్నై ట్రావెల్​ ఫెయిర్​లో రామోజీ ఫిల్మ్​ సిటీ స్టాల్​ సందడి- విజిటర్స్​ ఫిదా!

Eligibility for RAM Admission : ఈ ఆర్‌ఏఎం కోర్సుల కోసం నమోదు చేసుకోవడానికి గరిష్ఠ వయో పరిమితి లేదా కనీస అర్హత ప్రమాణాలు ఏమీలేవు. కనీస వయసు మాత్రం 15 సంవత్సరాలు. ఎంచుకున్న అధ్యయన భాషలో నైపుణ్యం తప్పనిసరి. అవసరమైన కమ్యూనికేషన్‌ను స్వీకరించడానికి విద్యార్థి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫోన్‌ నంబర్, ఈ మెయిల్ చిరునామాను కలిగి ఉండాలి.

Ramoji Academy Filmmaking Offer : సేఫ్‌ ఎగ్జామ్‌ బ్రౌజర్‌ (ఎస్‌ఈబీ) ద్వారా సురక్షితమైన దశలవారీగా ఆన్‌లైన్‌ కోర్సును ఆర్‌ఏఎం అందిస్తుంది. ఈ బ్రౌజర్‌లో కోర్సుకు సంబంధించి సబ్జెక్టుల గురించి పూర్తి సమాచారం ఉంటుంది. తద్వారా చలనచిత్ర నిర్మాణంలో వృత్తిని అభ్యసించే ఔత్సాహిక వ్యక్తులు (Enthusiastic People) సులభంగా నేర్చుకోవచ్చు. విద్యార్థికి వివరణాత్మక అధ్యాయం, సంబంధిత పరీక్షలు అందిస్తారు. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్లం, తమిళ, మలయాళ, మరాఠీ, కన్నడ, బెంగాలీ భాషల్లోనూ ఈ కోర్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ www.ramojiacademy.comలో చూడొచ్చు.

రామోజీ ఫౌండేషన్‌ చేయూతతో ఇబ్రహీంపట్నం ఆర్టీవో నూతన కార్యాలయం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.