Rains Alert in Andhra Pradesh : వాతావరణంలో ఏర్పడ్డ మార్పులు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో విజయవాడ, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వర్షం కురిసింది. బెజవాడలో కురిసిన చిన్నపాటి వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వర్షపునీరు, మురుగు కలిసిపోయి రోడ్లపై పారడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కదిరి నియోజకవర్గంలోని 6 మండలాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. సుమారు గంటన్నరపాటు కురిసిన వర్షంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. తీవ్ర ఎండ, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడి పోయిన అక్కడి ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగించింది.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం లోని 6 మండలాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. చిరుజల్లు రాకతో నిన్నటి వరకు తీవ్రమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతతో అల్లాడిపోయిన జనం ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం ప్రారంభమైన ఓ మోస్తరు వర్షం గంటన్నర పాటు కురిసింది. వాతావరణం మేఘావృతమై ఉన్నందున వాతావరణం చల్లగా మారింది. మరోసారి వర్షం కురిస్తే ఉక్కపోత నుంచి ఉపశమనం పొందవచ్చుని జనం ఆశిస్తున్నారు.
రాష్ట్రానికి చల్లని కబురు - అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ - Rain Alert in AP
అల్పపీడన ద్రోణి ప్రభావంతో బాపట్ల జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి పలుచోట్లు వర్షం పడుతోంది. చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, యద్దనపూడి, మార్టూరు, చినగంజాం, వేమూరు, భట్టిప్రోలు ప్రాంతాల్లో పెద్దఎత్తున వర్షం కురుస్తోంది. తీవ్ర ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు వరుణుడి రాకతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు.
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన ఐదారు రోజులకు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.ఈ ఏడాది సాధారణంతో పాటు పలు జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ద్రోణి ప్రభావంతో రేపు ( మే 18న) ఎన్టీఆర్, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ తెలిపింది. అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవచ్చని వెల్లడించింది.
అకాల వర్షంతో అల్లాడుతున్న రైతులు - తడిసిన ధాన్యం - Effect of rain on grain crop