ETV Bharat / state

మరో మూడు రోజుల్లో మరింత చురుకుగా నైరుతి రుతుపవనాలు - Andhra Pradesh Weather Update - ANDHRA PRADESH WEATHER UPDATE

Rainfall Alert Across Andhra Pradesh : నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల వాగులు పొంగి పొర్లాయి. వర్షం ధాటికి రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు జిల్లాల ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.

Rainfall Alert Across Andhra Pradesh
Rainfall Alert Across Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 10:23 PM IST

Rainfall Alert Across Andhra Pradesh : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు జోరందుకుంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రుతుపవనాల ప్రభావంతో దంచికొట్టిన వానలు - పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉక్కపోతకు గురిచేసిన వాతావరణం ఒక్కసారి మారింది. ప్రకాశం జిల్లాలోనూ పలుచోట్ల వర్షం కురిసింది. తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే మార్గంలోని కొండ వాగు, సీతానాగులవరం చప్టాపై నీరు ఉద్ధృతంగా పారింది. పంట చేతికొచ్చిన దశలో వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కోనసీమ జిల్లాలో వాతావరణం మారి ఒక్కసారిగా వాన పడడంతో వాతావరణం చల్లబడింది. కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానంలో తెల్లవారుజామున గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి డ్రైనేజీ లో ఉన్న చెత్త ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కడికి అక్కడ అడ్డుపడడంతో ప్రధాన రోడ్ల పైన వీధిలోని రోడ్లు జలమయమయ్యాయి. క్రీడా ప్రాంగణాలు, కాలేజీ మైదానాలు చెరువులను తలపిస్తున్నాయి. యానం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి ఆదేశాలతో పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీల్లోని చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టారు.

ఈ రెండ్రోజులు వర్షాలతో జాగ్రత్త!- విపత్తుల సంస్థ సూచన - RAIN ALERT IN ANDHRA PRADESH

ప్రకాశం జిల్లా మార్కాపురం, తర్లుపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే రహదారి జలమయమైంది. దీంతో వాగులు పొంగి చెరువులకు వర్షపు నీరు చేరింది. పంటలు అదును వచ్చిన నేపథ్యంలో వర్షం కురవడంపై బోరులో నీరు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

కడపలో భారీ వర్షం కురిసింది. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, భగత్ సింగ్ నగర్, భరత్ నగర్, అక్కయ్యపల్లె, మృత్యుంజయ కుంట, గంజికుంట కాలనీ, అప్సర రోడ్డు తదితర ప్రాంతాల్లో రహదారులపై భారీగా వర్షపు నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కురిసిన వర్షాలతో వైఎస్సార్ జిల్లాలోని కుందూ నది జలకళ సంతరించుకుంది.

అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం అంకంపల్లిలో కురిసిన వర్షానికి పంటలు నీటమునిగాయి. వెంకటేష్‌ అనే రైతుకు చెందిన నాలుగు ఎకరాల వేరుశనగ పంట మునిగిపోయింది. సుమారు 2 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం - రాబోయే 4 రోజులు పాటు వర్షాలు కురుస్తాయన్న అధికారులు - Rain Effect in AP

నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ - రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.