ETV Bharat / state

ఆరంభానికి ముందే అదరగొడుతున్న రుతుపవనాలు- భారీ వర్షాలు,పిడుగులతో అతలాకుతలం - Rain Disaster in AP - RAIN DISASTER IN AP

Rain Disaster People Struggle in Some Districts: సీమలో ముందస్తు వర్షాలు సామాన్యులకు బెదరగొడుతున్నాయి. శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షాలతో పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వృక్షాలు నేలకూలడం, విద్యుత్త్​ స్తంభాలు పడిపోవడం, డ్రైనేజీలు పొంగి పొర్లడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అటు పిడుగుపాట్లకు పలు కుటుంబాలు రోడ్డనపడ్డాయి.

Rain Disaster People Struggle in Some Districts
Rain Disaster People Struggle in Some Districts (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 1:02 PM IST

Rain Disaster People Struggle in Some Districts: శనివారం కురిసిన భారీ వర్షాలతో సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. కొత్తచెరువు - ధర్మవరం ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్‌ స్తంభం నేలకూలింది. ప్రధాన రహదారి పక్కనే విద్యుత్‌ స్తంభం నేలకూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లోచర్ల ప్రధాన రహదారి చెరువు కట్టపై ఉన్న భారీ వృక్షం నేలకూలడంతో రాత్రి నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వృక్షం నేలకూలడంతో కొత్తచెరువు నుంచి పెనుగొండకు వెళ్లే రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. పెనుగొండ ప్రధాన రహదారి మార్గంలోని రైల్వే వంతెన మునిగిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలలో వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన వాతావరణం- పలు జిల్లాలో భారీ వర్షాలు - Heavy Rains in Andhra Pradesh

సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపుల వర్షంతోపాటు గాలి ఉద్ధృతంగా వీచింది. దీంతో పలుచోట్ల వృక్షాలు, విద్యుత్తు స్తంబాలు కూలాయి. పట్టణంలోని వాసవీ నగర్​లో వేపవృక్షం కూలి విద్యుత్తు స్తంభంపై పడటంతో నేలవాలింది. ఉరుములు, మెరుపులతోపాటు విద్యుత్తు తీగలతో నిప్పులు రేగటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చెట్టు కొమ్ములు, విద్యుత్తు తీగలు వీధిలో అడ్డంగా పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జోరువానకు డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి వరద నీరు రావటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.

రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు - ఎప్పుడంటే ! - South West Monsoon 2024

అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల బూదగవి వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పెంచులపాడు - పొలికి గ్రామాల మధ్య ఉన్న పెద్ద వంక ఉద్ధృతంగా ప్రవహించడంతో రెండు గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లోని పలు గ్రామాల్లో రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలచిపోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో స్థానికులు రాత్రంతా చీకటిలో ఇబ్బందులు పడ్డారు.

వాయుగుండం ప్రభావం - ఈదురుగాలులతో భారీ వర్షం - rain effect in ap

అన్నమయ్య జిల్లా రాజంపేటలో గాలి వాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గాలికి రోడ్లపై చెట్లు పడిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది, పోలీస్ వారు రోడ్లపై ఉన్న చెట్లను తొలగించారు. విద్యుత్ పునరుద్దరణకు సిబ్బంది చర్యలు తీసుకున్నారు.

పుల్లంపేట మండలం వత్తలూరులో శనివారం రాత్రి పిడుగుపాటుకు పూరిల్లు దగ్ధమైంది. పిడుగు నుంచి బాధిత కుటుంబం ప్రాణాలతో బయటపడింది. పూరిగుడిసెతో పాటు నగదు కూడా మంటల్లో కాలిపోయిందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కట్టుబట్టలతో మిగిలిన తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు - AP WEATHER REPORT TODAY

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.