ETV Bharat / state

పులిచింతల ప్రాజెక్ట్​కు కృష్ణమ్మ పరవళ్లు - సంతోషంలో రైతులు - Pulichintala Project Gates Lifted

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 10:05 AM IST

Pulichintala Project Gates Open : నాగార్జునసాగర్​ జలాశయం నుంచి భారీగా వరద నీరు పులిచింతల ప్రాజెక్ట్​కు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 13 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద పెరిగే అవకాశం ఉండటంతో మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరొవైపు కృష్ణమ్మ పరవళ్లు, జలకళను చూసి పర్యాటకులు మైమరచిపోతున్నారు.

pulichintala_project
pulichintala_project (ETV Bharat)

Pulichintala Project Gates Open: పులిచింతల నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున అధికారులు 13 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పెరిగే అవకాశం ఉండటంతో మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు జలకళ సంతరించుకోవటం రైతుల్ని సంతోషంలో ముంచెత్తుతోంది. కృష్ణమ్మ పరవళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నందున ప్రాజెక్టు వద్ద సందడి నెలకొంది.

కృష్ణా డెల్టా ఆయకట్టుని స్థిరీకరించే లక్ష్యంతో పులిచింతల ప్రాజెక్టుని నిర్మించారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రాజెక్టు నిర్వహణ సరిగ్గా లేక 16వ నంబర్ గేటు కొట్టుకుపోయింది. గేటు బిగించటం కోసం జలాశయంలోని నీటిని మొత్తం ఖాళీ చేశారు. ఆ తర్వాత గేటు బిగించటానికి జగన్‌ ప్రభుత్వం దాదాపు రెండేళ్లు సమయం తీసుకుంది. గేటు బిగించిన తర్వాత ప్రాజెక్టుకు వరద రాకపోవడంతో పూర్తిగా నిండలేదు. నిన్నమొన్నటి వరకూ అట్టడుగు నీటిమట్టాలు ఉండేవి.

పులిచింతల ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమం - కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యేలు - Jalaharati Program at Pulichintala

భారీ వర్షాలు, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వచ్చిపడుతున్న వరదతో నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు నిండిపోవటంతో ప్రకాశం బ్యారేజికి నీరు విడుదల చేస్తున్నారు. వరద ఇంకా కొనసాగుతున్నందున మరికొన్ని రోజులు గేట్లు ఎత్తి ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. వరద కారణంగా పులిచింతల ముంపు గ్రామాల్లోకి నీరు చేరుతోంది. అయితే ఇప్పటికే అక్కడి ప్రజలకు పరిహారం చెల్లించి పునరావాసం కల్పించారు. మూడేళ్లుగా ప్రాజెక్టులో నీరు లేని కారణంగా కొందరు తిరిగి వచ్చి గ్రామాల్లో ఉంటున్నారని వారిని ఖాళీ చేయాలని సూచించినట్లు పులిచింతల ఎస్ఈ తెలిపారు.

"ఈ సంవత్సరమంతా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రమంతా సస్యమలం అవుతుంది. తెలుగుదేశం పార్టీ పాలన రాగానే అన్నీ ప్రాజెక్ట్​లకు నీరు పుష్కలంగా వచ్చిపడ్డాయి. ప్రజలు, రైతులకు తాగునీరు, సాగునీరుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు" -రైతులు

నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వం ఫోకస్ - 6 ప్రాజెక్టుల పూర్తికి తొలి ప్రాధాన్యం - AP Govt Focus on Irrigation Project

పులిచింతలకు చాలా రోజుల తర్వాత వరద రావడం, గేట్లు ఎత్తిన విషయం తెలుసుకున్న ప్రజలు భారీగా జలాశయం వద్దకు వస్తున్నారు. జల సిరులను చూస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. చిరుజల్లులను, కృష్ణమ్మ పరవళ్లను కలగలిపి తమ ఫోన్లలో బంధిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

పులిచింతల జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 31.89 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి 2.45 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 2.30 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం 15 వేల క్యూసెక్కుల నీరు మళ్లించారు.

నిండు కుండలా పులిచింతల ప్రాజెక్టు - సాగర్ నుంచి వస్తున్న వరద

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.