ETV Bharat / state

జనసేన కార్యాలయానికి పోటెత్తిన వైఎస్సార్సీపీ బాధితులు - Public Grievance at JSP Office - PUBLIC GRIEVANCE AT JSP OFFICE

Public Grievances of Janasena Leaders: వైఎస్సార్సీపీ నేతల అక్రమాలకు బలైపోయిన బాధితులు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి వినతులు సమర్పించారు. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు.

Public Grievances of Janasena Leaders
Public Grievances of Janasena Leaders (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 10:32 PM IST

జనసేన కార్యాలయానికి పోటెత్తిన వైఎస్సార్సీపీ బాధితులు - వినతులు స్వీకరణ (ETV Bharat)

Public Grievances of Janasena Leaders in Party Office: గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఫిర్యాదులు సమర్పించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ బాధితులు ఆ పార్టీ నేతల అరాచకాలపై జనసేన నేతలకు ఫిర్యాదులు చేశారు.

'వైఎస్సార్సీపీ నాయకులు ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేశారు' - జనసేన నేతలకు బాధితుల ఫిర్యాదు - YSRCP Victims at Janasena Program

అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కాకినాడ జిల్లా కోటనందూరులో కొలువైన శ్రీ సర్వ మంగళాంబ భోగలింగేశ్వర స్వామి, సీతారామ దేవాలయాలకు చెందిన 9 ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ నేతలు ఆక్రమించి గత మూడేళ్లుగా లబ్ధి పొందుతున్నారని అర్చకులు ఫిర్యాదు చేశారు. రెండు ఆలయాల్లోని హుండీల కానుకలు సైతం దోచుకుంటున్నారని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఆలయ భూమిని వారి దగ్గర నుంచి విడిపించాలని కోరారు. తాడేపల్లిగూడేనికి చెందిన ఓ దివ్యాంగుడు తనకు వైకల్య ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అందట్లేదని ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రామకృష్ణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తహసీల్దార్​తో మాట్లాడి అవసరమైన ధృవ పత్రాలు వచ్చేలా ఏర్పాటు చేశారు.

22వ రోజు ప్రజాదర్బార్‌- జోరువానలోనూ వినతుల వెల్లువ - Lokesh Praja Darbar 22nd Day

బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్​లో హోంగార్డుగా పని చేస్తున్న ఏడుకొండలు ప్రజల నుంచి అక్రమంగా దోచుకున్న 3 కోట్ల 80 లక్షలు ఇప్పించాలని చిన్నగంజాంకు చెందిన మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ముక్కపాడులో వైఎస్సార్సీపీ నేతలు పోరంబోకు, ప్రభుత్వ భూమిని ఆక్రమించి షాపులు నిర్మించారని అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. భూ సమస్యలపై వెంటనే జిల్లా తహసీల్దార్​కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే రామకృష్ణ కోరారు. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం నాగలూరులో తన 5 ఎకరాల భూమిని చిన్నాన్నతో కలిసి వైఎస్సార్సీపీ నాయకులు కబ్జా చేశారని పల్లపు మంజునాథ జనసేన పార్టీ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2024 జనవరిలో పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్లకు సంబంధిన పోస్టులను తీయడంలోనూ తమకు అన్యాయం చేశారని బాధితులు వాపోయారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్‌- పెద్దఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ బాధితులు - Public Grievance at TDP Office

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.