ETV Bharat / state

పవన్ కల్యాణ్​ అభిమానికి ఆటో గిఫ్ట్- ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నిర్మాత - SKN Auto Gifted to Pawan Fan Family

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 8:18 PM IST

Producer SKN Auto Gifted to Pawan Kalyan Fan Family: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో గెలిచిన తర్వాత ఆయన అభిమాని అయిన మరియమ్మ కుటుంబానికి ఆటో రిక్షా కొనిస్తానని నిర్మాత ఎస్కేయన్‌ ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఆటో కొనిచ్చి మాట నిలబెట్టుకున్నారు.

skn_auto_gifted_to_pawan_fan_family
skn_auto_gifted_to_pawan_fan_family (ETV Bharat)

Producer SKN Auto Gifted to Pawan Kalyan Fan Family: బేబి చిత్ర నిర్మాత, పవన్ కల్యాణ్ వీరాభిమాని ఎస్కేఎన్ తన సేవా గుణాన్ని చాటుకున్నారు. పిఠాపురానికి చెందిన మరియమ్మ అనే నిరుపేద మహిళకు ఆటోను బహుమతిగా అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తానని మరియమ్మ హామీ ఇచ్చింది. ఆ విషయం తన దృష్టికి రావడంతో స్పందించిన ఎస్కేఎన్ పవన్ కళ్యాణ్ గెలిస్తే మరియమ్మకు తన డబ్బులతో ఆటో కొనిస్తానని మాటిచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురం వెళ్లిన ఎస్కేన్ మరియమ్మకు ఆటో కానుకగా ఇచ్చి వారి కుటుంబంలో ఆనందాన్ని నింపారు. ఆటోకు రిబ్బన్ కట్ చేసి మరియమ్మతో కలిసి ఆటోలో తిరిగి ఆనందపర్చారు. ఎక్స్‌ వేదికగా మరియమ్మ కుటుంబంతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. ఎస్కేఎన్ తన మాట నిలుపుకోవడమే కాకుండా మరియమ్మ కుటుంబానికి ఆధారంగా నిలవడం పట్ల జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

ఇదీ జరిగింది: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం జోరుగా సాగుతుండగా పలు మీడియా సంస్థలు ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్ గెలిచిన తర్వాత నా భర్త రిక్షా తొక్కిన డబ్బులు పెట్టి, ఊరంతా పార్టీ ఇచ్చేస్తా అని మరియమ్మ అనే మహిళ అన్న వీడియో అప్పట్లో బాగా వైరల్‌ అయింది. ఆ వీడియోను జనసేన పార్టీ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేయగా దానికి నిర్మాత ఎస్కేయన్‌ స్పందించారు. పవన్ కల్యాణ్‌ గెలిచిన తర్వాత ఆటో కొని వీడియోలో ఉన్న మహిళ భర్తకు కానుకగా ఇస్తానని తెలిపారు. నా హీరో, అభిమాన నాయకుడి పట్ల ఆమె చూపిన స్వచ్ఛమైన ప్రేమకు ఇదే బహుమతి అని అన్నారు.

అన్నట్లుగానే మరియమ్మ ఇంటికి వెళ్లిన ఎస్కేఎన్ ఆటోను కానుగా ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా నాకెంతో ఇష్టమైన నాయకుడి పట్ల మరియమ్మ కుటుంబం చూపిన ప్రేమకు గుర్తుగా ఆటో కొనిచ్చానని తెలిపారు. వాళ్ల మనవడు ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తానని చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు. వాళ్ల కళ్లలో ఆనందం చూసి ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మన ప్రియతమ నాయకుడు పవన్‌ కల్యాణ్‌కి మరింత శక్తినివ్వాలని ఆయన గర్వపడేలా అభిమానులు, అనుచరులు నడుచుకోవాలని ఎస్కేఎన్ సూచించారు.

సబ్సిడీ ధరల్లో నిత్యావసర సరకులు- రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు - Essential Commodities Distribution

ఏపీలో కొత్తగా మరో ఐదు ఎయిర్ పోర్టులు- రెండేళ్లలో భోగాపురం పూర్తి:చంద్రబాబు - Chandrababu inspected Bhogapuram

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.