Private Travels Bus Driver Issue In Tirupati : ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్వాకంతో అయ్యప్ప భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఘటన తిరుపతి (Tiripati) లో జరిగింది.
అసలేం జరిగిందంటే.. శబరిమల వెళ్లిన అయ్యప్ప భక్తులు తిరుగు ప్రయాణంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం ఆలస్యమైంది. వేచి ఉండలేక పోయిన డ్రైవర్ 35 మంది అయ్యప్ప భక్తులను వదిలేసి బస్సుతో తిరిగి వెళ్లిపోయాడు. బస్సులో ఉన్న బ్యాగులను కిందపడేసి మరీ వెళ్లిపోయాడు. దీంతో బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద భక్తులు ఇక్కట్లు పడ్డారు. వెంటనే అయ్యప్ప భక్తులు డయల్ 100కు కాల్ చేశారు. స్పందించిన పోలీసులు నెల్లూరు టోల్‌గేట్ వద్ద బస్సును ఆపించారు. మరోవైపు అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో సదరు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యంపై అయ్యప్ప భక్తులు ఫిర్యాదు చేశారు.
Chakrateertha Mukkoti Special : నేడు చక్రతీర్థ ముక్కోటి సందర్బంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాల్లో చక్రతీర్థ ముక్కోటి ఒకటి. పవిత్ర తిరుమల గిరుల్లో ఎన్నో పుణ్య తీర్థాలు ఉన్నాయి. కుమారధార, ఆకాశగంగ, పాపవినాశనం, చక్ర తీర్థం వంటి తీర్ధాలు తిరుమల పవిత్రతను మరింత పెంచుతున్నాయి. ఈ తీర్థాలకు ఏటా ముక్కోటి ఉత్సవం జరుగుతుంది.
ప్రైవేట్ ట్రావెల్స్ దసరా దందా ! రద్దీకి అనుగుణంగా చార్జీల రెట్టింపు
సరిపోని రైళ్లు, బస్సులు.. ప్రయాణికుల నుంచి ఇష్టారీతిన వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్