ETV Bharat / state

"మన దగ్గర బేరాల్లేవమ్మా!" - భయపెడుతున్న రైతు బజార్ మార్కెట్ రేట్లు

అమాంతం పెరిగిన కూరల ధరలు - హడలిపోతున్న కొనుగోలుదారులు

vegetable_price_hike_in_visakhapatnam
vegetable_price_hike_in_visakhapatnam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2024, 12:23 PM IST

Vegetable Price Hike in Visakhapatnam : గత కొన్ని రోజులుగా నగరంలో కర్రీపాయింట్లలో కూరలు కొనుగోలు చేసే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. కూరగాయల ధరలు పెరిగిపోవడంతో కర్రీ పాయింట్ల నిర్వాహకులు ఒక్కసారిగా కూరలు, సాంబారు, రసం ధరలను అమాంతం పెంచేశారు. ప్యాకెట్‌ పరిమాణం ప్రకారం ఇవి పెరిగాయి.

Vegetable Market Prices
"మన దగ్గర బేరాల్లేవమ్మా!" - భయపెడుతున్న రైతు బజార్ మార్కెట్ రేట్లు (ETV Bharat)

Prices of Curries Increased Due to High Rate to Vegetables In Visakhapatnam : గతంలో ప్యాకెట్‌ ధర రూ.20 ఉంటే ఇప్పుడు చాలా చోట్ల రూ.30 చేశారు. కొన్ని చోట్ల ఇది రూ.40 కూడా అయింది. గతంలో రూ.15, 20కి లభించే సాంబారు ఇప్పుడు రూ.30కి చేరింది. ఉల్లి, టమాట, అల్లం, వెల్లుల్లి ధరలు బాగా పెరగడంతో పెంచక తప్పలేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చి వసతి గృహాల్లో, అద్దెకు ఉంటున్న ఎంతో మందికి కర్రీ పాయింట్లే ఆధారం. అక్కడే పరిస్థితి ఇలా ఉండటంతో జేబులు ఖాళీ అవుతున్నాయని వాపోతున్నారు.

స్థానికంగా లభించేవి
ఆకుకూరలుఆనప
బీరబెండ
దొండకాకర బరబాటి

సాగు తగ్గింది కానీ ధర అదిరింది - టమోటా రైతుల్లో ఆనందం - Tomato Farmers Happy prices

దిగుమతి చేసుకునే రకాలు
ఉల్లిక్యాప్సికం
టమాటక్యారెట్
బంగాళదుంపక్యారెట్
క్యాబేజీ మిరప
బీట్‌రూట్బీన్స్, చిక్కుడు

ఎందుకీ పరిస్థితంటే: వాస్తవానికి నగర ప్రజల అవసరాలకు స్థానికంగా పండించే పంటలు సరిపోవు. చాలా రకాలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లోనూ పంటల దిగుబడి పడిపోయింది. స్థానిక పంటలూ ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్నాయి. మరో వైపు దసరా నేపథ్యంలో కాయగూరల వినియోగం కూడా పెరిగిపోయింది.

రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వం వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పాత ఉల్లి కేజీ రూ.50కి అమ్ముతున్నారు. దిగుమతి ఆలస్యమైతే ఈ ధరలు మరింత పెరగొచ్చు. టమాట రెండు రోజుల కిందటి వరకు కేజీ రూ.74 ఉండేది. ఇప్పుడు రూ.64కి తగ్గేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇంకా తగ్గించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో నగరానికి సరిపడ రకాల దిగుమతిపై ప్రణాళిక చేయకపోతే కొరత ఏర్పడి ధరలు మరింత భారమయ్యే ప్రమాదం లేకపోలేదు.

ట'మాటల్లేవ్‌' - సెంచరీ కొట్టిన రేటు - Tomato Price Hike in AP

నగరంలోని రైతు బజార్లు13
నిత్యం అవసరమయ్యో కూరగాయలు5000 క్వింటాళ్లు
ప్రస్తుతం ఉన్న కూరగాయలు4000 క్వింటాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.