Prathidhwani : టీనేజ్ స్వేచ్ఛగా ఉండాలని, తనకంటూ వ్యక్తిగత సమయం కావాలని, తనను తాను నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరే దశ. ఈ క్రమంలో కుటుంబం నుంచి సమాజం నుంచి కొన్ని ఒత్తిళ్లు ఎదురవుతూంటాయి. అయితే వారిలో సవాళ్లను తట్టుకునే సామర్థ్యం లేకపోవడంతో చాలామంది యుక్త వయసులోకి ప్రవేశించిన తర్వాత తీవ్ర మానసిక ఆందోళనలతో సతమతం అవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
తోటివారితో పోల్చుకునే మనస్తత్వం టీనేజర్లలో చాలా ఎక్కువ. అందం, ఆహార్యం, రంగు, బరువు గురించి కుంగిపోతారు. టీనేజర్లలో ఆడపిల్లలు, మగపిల్లల సమస్యలు వేర్వేరు. మరి టీచర్లు, తలిదండ్రులు దానిని అర్థం చేసుకోవటం ఎలా? యుక్తవయసు పిల్లల్లో వచ్చే సమస్యలను సరిదిద్దడం ఎలా? కుటుంబసభ్యులు చేయకూడని ఏంటి? చేయాల్సినవి ఏంటి? ప్రవర్తనలో లోటుపాట్లు ఏవైనా ఉంటే ఎలా గుర్తించాలి? పేరెంట్స్, తోబుట్టువులు ఎలా ఉండాలి? వారిలో కుంగుబాటును సరిదిద్ది, వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా వారిని ప్రోత్సహించటం ఎలా? టీనేజ్ వయసులో ఎదురయ్యే సమస్యలేంటి? వాటికి కారణాలేంటి? పరిష్కార మార్గాలేంటి? ఇదీ నేటి ప్రతిధ్వని.