Prakasam District jawan death in Jammu Kashmir Poonch : సైన్యంలో 23 ఏళ్లుగా సేవలందిస్తున్న జవాన్ తాను ప్రాణాలు కోల్పోతున్నా సహచరులను కాపాడి వీరమరణం పొందిన ఘటన ఇది. ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన వరికుంట్ల సుబ్బయ్య(43) రాష్ట్రీయ రైఫిల్స్‌లో హవల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ పరిధి నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట సోమవారం సహచర జవాన్లతో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా పొరపాటున భూమిలో పాతిపెట్టిన మందుపాతరపై(ల్యాండ్‌మైన్) కాలు పెట్టారు.
ఆ విషయాన్ని గుర్తించిన సుబ్బయ్య సహచర జవాన్లను కాపాడటానికి గో బ్యాక్ అంటూ గట్టిగా అరుస్తూ వారిని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో మందుపాతర పేలి ఆయన మృతి చెందారు. సుబ్బయ్యకు భార్య లీల, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాదం విషయం తెలిసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. జవాన్ స్వస్థలం రావిపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
లద్దాఖ్‌లో ఏపీ సైనికుల వీరమరణం- అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు - Jawan Died in Accident in Ladakh
లద్దాఖ్ ఆర్మీ విన్యాసాల్లో కృష్ణా జిల్లాకు చెందిన జవాన్ నాగరాజు మృతి - Jawan Died in Ladakh Accident