మంచిర్యాల ఎంసిహెచ్ ఆసుపత్రిలో కరెంటు లేక పోవడం వల్ల బాలింతలు, నవజాత శిశువులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను. pic.twitter.com/rGAEI96dkt
— Harish Rao Thanneeru (@BRSHarish) July 4, 2024
Power Cut in Mancherial Govt Mother and Child Hospital : సిబ్బంది నిర్లక్ష్యం బాలింతలు, నవజాత శిశువులు కొన్ని గంటలపాటు అంధకారంలో ఉండేలా చేసింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎలాంటి కాన్పులు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఆరోగ్య కేంద్రంలో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి, ఆసుపత్రి నిర్వహణ మొత్తం జనరేటర్ సాయంతో నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.
బాధితుల ఆవేదన : ఓ వైపు వర్షాలు మొదలయ్యాయని, మరోవైపు పాములు ఎంసీహెచ్ పరిసరాల్లో సంచరిస్తున్నాయని బాధితులు తెలిపారు. వీటికి తోడు విద్యుత్ అంతరాయంతో ఎంసీహెచ్‌లో ఆందోళన పరిస్థితి నెలకొందన్నారు. ఎలుకలు విద్యుత్ సరఫరా కేబుళ్లను కొరకడంతో గత రెండు రోజులుగా కరెంటు నిలిచిపోయిందని సిబ్బంది చెబుతున్నారని పేర్కొన్నారు. పలుమార్లు షార్ట్ సర్క్యూట్‌తో ఇబ్బందులు ఎదురయ్యాయని, జనరేటర్ కూడా వినియోగించలేని స్థితికి రావడంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఇబ్బందులు పడ్డారని సిబ్బంది వెల్లడించారు.
గర్భిణీలకు, చిన్నపిల్లలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే శస్త్రచికిత్సలను వాయిదా వేశాం. ఎస్ఎన్సీయూకు ప్రత్యామ్నాయం చేపట్టి సమస్యను గుర్తించాం. చివరకు జనరేటర్ రిపేర్ చేశాం. కానీ నేరుగా విద్యుత్ వచ్చేలా చేయలేకపోయాం. విద్యుత్ సరఫరాలో అంతరాయం గురించి అధికారులకు సమాచారం అందిస్తే వారు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
ప్రస్తుతానికి జనరేటర్‌ను అయితే ఉపయోగించుకోవాలని మరుసటి రోజు వచ్చి మరమ్మతు చేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. జనరేటర్‌కు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినా ఏదైనా ఇబ్బంది కలిగితే బాధితులు అవస్థలు పడాల్సి వస్తుందని ఆందోళన చెందారు. అయితే ఈ సమస్యపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. మంచిర్యాల ఎంసీహెచ్ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడం వల్ల బాలింతలు, నవజాత శిశువులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం ఆస్తులను జప్తు చేసిన కోర్టు సిబ్బంది - RDO Office Seized in Mancherial