Posani Krishna Murali Quit Politics: సినీ నటుడు, వైఎస్సార్సీపీ పోసాని కృష్ణ మురళి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. జన్మలో ఇక రాజకీయాల గురించి మాట్లాడనన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ను అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై వైఎస్సార్సీపీ నేతగా ఉన్న పోసానిపై ఇటీల సీఐడీ కేసు నమోదు చేసింది. అలానే రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్‌లలో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని ఏకవచనంతో సంబోధించడమే గాక, తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని టీడీపీ నాయకులు ఆరోపించారు. పోసానిపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులోని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో పోసాని మీడియా సమావేశం ఏర్పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేయడం గమనార్హం.
అదానీ లంచం కేసు - వైఎస్సార్సీపీ సర్కార్‌కు భారీగా ముడుపులు
మంచి నాయకుడిని ఎప్పుడూ విమర్శించలేదు: రాజకీయాల గురించి మాట్లాడుతున్న సమయంలో అందరినీ విమర్శిస్తున్నానని అందరూ అనుకుంటున్నారని పోసాని అన్నారు. తాను రాజకీయ పార్టీ నాయకుల నీతి, నిజాయతీలు, నడవడికను బట్టి కామెంట్స్ చేశాను తప్ప మంచి నాయకుడిని ఎప్పుడూ విమర్శించలేదని తెలిపారు. ప్రధాని మోదీ తనకు ఎప్పటి నుంచో తెలుసని ఆయన జీవితంలో అవినీతి లేదని ఎప్పుడూ నిజాయతీగా మాట్లాడతారని తెలిపారు. అంతే కాకుండా మంత్రి స్థాయి నుంచి ఎదిగి దేశ ప్రధాని అయ్యారని కొనియాడారు. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్, రాజశేఖర్‌రెడ్డి, ఎన్టీఆర్ ఇలా అందరికీ సపోర్ట్ చేశానని కానీ తప్పులు చేసిన ప్రతి ఒక్కరినీ విమర్శించానని అన్నారు.
తప్పు చేస్తేనే తిట్టా: 1983 నుంచి రాజకీయాలపై మాట్లాడుతున్నానని, ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ మరో పార్టీని తిట్టనని పోసాని అన్నారు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్లనే తిట్టానని అన్నారు. ఇప్పటి నుంచి నా జీవితకాలం నేను రాజకీయాలు మాట్లాడనని, వాటి ప్రస్తావన కూడా తీసుకురానని వెల్లడించారు. ఏ పార్టీనీ పొగడను, మద్దతు తెలపను, విమర్శించనని తెలిపారు. తను ఇలా మాట్లాడటానికి కారణం కేసు పెడుతున్నారని కాదని 16 ఏళ్ల పిల్లల నుంచి 70 ఏళ్ల వృద్ధురాలి వరకూ అసభ్య పదజాలంతో తిడుతున్నారని అన్నారు.
ఏ పార్టీని పదవి కావాలని అడగలేదని ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని అన్నారు తాని వద్దని చెప్పానని అన్నరు. ఎక్కువగా పొగిడింది నారా చంద్రబాబునేనని అది ఆయన్నే అడగండని పోసాని అన్నారు. చంద్రబాబు ఓడిపోయిన తర్వాత జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లి కలిశానని పోసాని తెలిపారు.
జగన్ మెడకు అదానీ స్కామ్ - చేతులు మారిన రూ.1750 కోట్లు - అమెరికా కోర్టు ఆరోపణ
ఆ BMW కార్లు ఎక్కడ? - పవన్ కల్యాణ్ ఆరా - తమకేం తెలియదంటున్న అధికారులు