ETV Bharat / state

సైబర్​ క్రైం బారిన పడ్డారా? - ఆలస్యం చేస్తే మొదటికే మోసం - పోలీసులు ఏం చెప్తున్నారంటే! - CYBER CRIMES rcoverie percentage - CYBER CRIMES RCOVERIE PERCENTAGE

Police Recovering Less Amount in Cybercrime: తెలుగు రాష్ట్రాల్లోనూ సైబర్​ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లాభాల ఆశచూపుతూ సైబర్ మోసగాళ్లు భారీగా దండుకుంటున్నారు. సైబర్ నేరాల్లో పోలీసులు అతి కష్టం మీద ఎంతో కొంత రికవరీ చేస్తున్నారు. అయితే, బాధితులు సకాలంలో ఫిర్యాదు చేయకపోవడం రికవరీపై ప్రభావం చూపుతోందని పోలీసులు పేర్కొంటున్నారు.

Police Recovering Less Amount in Cybercrime
Police Recovering Less Amount in Cybercrime (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2024, 12:56 PM IST

Police Recovering Less Amount in Cybercrime : తెలుగు రాష్ట్రాల్లో సైబర్​ నేరగాళ్లు కొండంత సంపద కొల్లగొడుతుంటే, పోలీసులు మాత్రం అతి కష్టం మీద గోరంత నగదును రికవరీ చేయగలుగుతున్నారు. 90 శాతం మంది బాధితులకు న్యాయం దక్కడం లేదు. ఒక్క తెలంగాణ నుంచే ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో సైబర్​ మోసగాళ్లు రూ.1300 కోట్లు కొల్లగొట్టారు. కానీ ఇందులో పోలీసులు ఇప్పటి వరకు రూ.114 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. ఇది పోయిన సొమ్ములో 10 శాతం కూడా కాదు. ప్రజలు సైబర్​ నేరాల పట్ల కొద్దిపాటి అవగాహన పెంచుకుంటే వాటిని నియంత్రించడంతో పాటు బాధితులు పోగొట్టుకున్న సొమ్ములో చాలావరకు తిరిగి రాబట్టవచ్చని సైబర్​ పోలీసులు చెబుతున్నారు.

డిజిటల్​ అరెస్ట్​ చేసి : ఉదాహరణకు ఒక ప్రముఖ బహుళజాతి సంస్థలో అకౌంట్స్ విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న వ్యక్తికి ముంబయి పోలీసుల పేరిట ఓ ఫోన్​ కాల్​ వచ్చింది. మనీ లాండరింగ్​కు పాల్పడ్డారని, వీడియో కాల్​ ద్వారా సీబీఐ విచారణకు హాజరుకావాలని చెప్పారు. అలా వీడియో కాల్​లో విచారణలో ఆధార్​కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పాలని డిమాండ్​ చేశారు. బెదిరించి ఆయన్ను డిజిటల్ అరెస్ట్​ చేయడంతో ఆయన భయంతో అన్ని వివరాలు ఇచ్చారు. అకౌంట్​లోని సొమ్మంతా పోయాక మోసపోయానని తెలిసిన తర్వాత ఏమీ చేయాలో బాధితునికి అర్థం కాలేదు. ఆలస్యంగా 1930కి కాల్​ చేసి ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆయన ఖాతా నుంచి మాయమైన సొమ్మంతా దేశ వ్యాప్తంగా వేర్వేరు ఖాతాల్లోకి జమకావడం వాటిని నేరగాళ్లు ఎక్కడికక్కడ డ్రా చేసుకోవడం అన్ని జరిగిపోయాయి.

ఆన్​లైన్​​ నేరాలకు చెక్​ పెట్టేలా ప్రభుత్వం వ్యూహాలు - ఇకపై జిల్లాకో సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ - Cyber ​​Crime Police Station in AP

ఆలస్యంగా ఫిర్యాదు చేయడంతో : ఇక్కడ విషయం ఏమిటంటే ఉన్నత ఉద్యోగస్థుడైన ఆయనకు దర్యాప్తు సంస్థలేవీ వీడియో కాల్​ ద్వారా విచారణ చేయవన్న అవగాహన లేకపోవడం. ఎవరైనా ఇలా డిజిటల్ అరెస్టుకు గురై డబ్బులు పోగొట్టుకున్నప్పుడు వెంటనే 1930కి కాల్​ చేస్తే ఇతర ఖాతాల్లోకి బదిలీ కాకుండా వాటిని ఆపేస్తారని తెలియకపోవడం. బాధితులు ఆలస్యంగా ఫిర్యాదు చేయడం వల్ల నగదును రికవరీ చేయలేకుపోతున్నామని అందుకే ఇప్పటికీ 10శాతం కూడా మించలేదని పోలీసులు చెబుతున్నారు.

సైబర్ నేరగాళ్లున్నారు బీ కేర్​ ఫుల్​ - Cyber Crimes Persisting

వైద్యుడిని భయపెట్టి రూ.33 లక్షలు దోచేసిన సైబర్ నేరగాళ్లు - Cyber Crime in Satya Sai District

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.