ETV Bharat / state

టీడీపీ కార్యాలయంపై అటాక్​ కేసు - దాడి చేసిన వారికి డబ్బులు - TDP Central Office Attack Case

TDP Central Office Attack Case Updates : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నాయకుల అక్రమాలు ఒక్కోక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లు దాడికి సంబంధించిన విషయాలు తమకేమి తెలియదని బుకాయించిన ఆ పార్టీ నేతల బండారాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారికి వైఎస్సార్సీపీ నేతల ఖాతా నుంచి డబ్బులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారి ఖాతాల వివరాలు ఇవ్వాలని అడగగా వారు నిరాకరించినట్లు తెలిసింది.

TDP Central Office Attack Case
TDP Central Office Attack Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2024, 12:49 PM IST

Mangalagiri Police Inquiry on TDP Office Attack Case : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి చేసిన వ్యక్తుల్లో గుంటూరు నుంచి వచ్చిన వారికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ నుంచి వచ్చిన వారికి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఆ పార్టీ సమన్వయకర్త దేవినేని అవినాష్‌ డబ్బులిచ్చారని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఇంతవరకు జరిపిన దర్యాప్తులో పలువురు నిందితులు ఈ విషయాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బుధవారం లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. ఆధారాలను ముందుపెట్టి విచారించినా సహకరించలేదని, పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని విచారణాధికారి, మంగళగిరి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. ఘటన జరిగిన రోజు అంశాలకు విచారణలో చెబుతున్న వివరాలకు ఏమాత్రం పొంతన లేదని సీఐ వివరించారు. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, న్యాయవాది ఒగ్గు గవాస్కర్‌ను పోలీసులు పిలిచారు. గవాస్కర్‌ ఉదయం 11 గంటలకు వచ్చి గంటన్నర తరువాత వెళ్లిపోయారు.

సంబంధం లేని సమాధానాలు : లేళ్ల అప్పిరెడ్డి మాత్రం సాయంత్రం 4 గంటలకు విచారణ సమయం ముగుస్తుండగా 3:45 గంటలకు హాజరయ్యారు. గంటన్నరపాటు ఆయన్ను విచారించి 14 ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ సంబంధం లేని సమాధానాలిచ్చారని సీఐ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. దాడిలో పాల్గొన్న కొంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలకు డబ్బులిచ్చిన అంశంపై ప్రత్యేకంగా ప్రశ్నించినా సంతృప్తికర సమాధానం చెప్పలేదని సీఐ వెల్లడించారు.

Mangalagiri TDP Office Attack Case : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఇంఛార్జ్​గా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి అక్కడి వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్నందున ఆ కోణంలో పోలీసు విచారణ సాగింది. టీడీపీ ఆఫీసుపై దాడికి పెద్దఎత్తున కార్యకర్తలను సమీకరించి తొలుత తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి చేరుకునేలా అప్పిరెడ్డి వ్యూహం రచించారు. ఆయా ప్రాంతాల నుంచి శ్రేణులకు వాహనాలు సమాకూర్చడం, భోజన ఏర్పాట్లు చేయడంపై పోలీసులు ప్రశ్నించగా నాకేమీ తెలియదని లేళ్ల అప్పిరెడ్డి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. పార్టీ కార్యాలయం ఇంఛార్జ్​గా ఉన్నందున అంతమంది కార్యకర్తలు, నాయకులు ఎందుకు వచ్చారో తెలియకపోవడం ఏమిటని పోలీసులు ప్రశ్నిస్తే ఆయన నీళ్లు నమిలినట్లు తెలిసింది.

బ్యాంకు ఖాతా వివరాలు అడిగితే చెప్పలేదు. పైగా మీకెందుకంటూ లేళ్ల అప్పిరెడ్డి పోలీసులను ఎదురు ప్రశ్నించారు. పోలీసులు ఆధారాలు చూపినా సంబంధం లేని సమాధానాలు చెబుతూ విచారణకు సహకరించలేదు. ఘటన సమయంలో వినియోగించిన ఫోన్‌ ఇవ్వడానికీ అంగీకరించలేదు. ఘటన జరిగిన తర్వాత విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ పోలీసు అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో అతనిని కూడా కేసులో చేర్చే అవకాశమున్నట్లు సమాచారం.

ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ కార్యాలయంపై దాడి- అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా

టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - కీలక నిందితులుగా వైఎస్సార్సీపీ నేతలు - TDP Office Attack Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.