ETV Bharat / state

నాపై దాడికి చెవిరెడ్డే కారణం - పోలీసులకు తెలిపిన పులివర్తి నాని - police Interrogate Pulivarthi nani

Police Interrogated to Pulivarthi Nani : తిరుపతి ఎస్వీ మహిళా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో విచారణ వేగవంతం చేశారు. నానిని ఎస్‌వీయూ క్యాంపస్‌లోని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి, సీఐ మురళీ మోహన్‌ వివరాలు సేకరించారు. ఈ కేసులో అసలు పాత్రధారులు, సూత్రధారులను వదిలేసి అమాయకలను ఇరికించారని పులివర్తి నాని విమర్శించారు.

Police Interrogated to Pulivarthi Nani
Police Interrogated to Pulivarthi Nani (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 8:45 PM IST

Police Interrogated to Pulivarthi Nani : తిరుపతి ఎస్వీ మహిళా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో విచారణ వేగవంతం చేశారు. నానిని ఎస్‌వీయూ క్యాంపస్‌లోని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి, సీఐ మురళీ మోహన్‌ వివరాలు సేకరించారు. అనంతరం పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ, పద్మావతి వర్శిటిలో నాపై దాడికి కర్త, ఖర్మ, క్రియ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డేనని తెలిపారు. ఈ కేసులో నిందితులను వదిలేసి అమాయకులను ఇరికించారని డీఎస్పీకి తెలిపినట్లు చెప్పారు. అరెస్టు చేసిన వారిలో నలుగురు అమాయకులేనని వివరించారు. ఆ దాడిలో భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘు, భానుకుమార్ రెడ్డి నన్ను చంపాడానికి చూశారని గుర్తు చేశారు. ఈ కేసులో అసలు పాత్రధారులు, సూత్రధారులను పోలీసులు వదిలేశారని విమర్శించారు. ఆ ఘటనలో 70 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.

నాపై దాడికి చెవిరెడ్డే కారణం - పోలీసులకు తెలిపిన పులివర్తి నాని (ETV Bharat)

ఆధారాలన్నీ అందించాం- దాడి వెనకున్న మూల పురుషుడెవరో తేల్చాలి : నాని - SIT investigation Pulivarthi Nani

రిపోలింగ్ చేస్తే మాకే పోలింగ్ శాతం పెరుగుతుంది : నాపై హత్యాయత్నం చేస్తే వైఎస్సార్సీపీ కార్యకర్తలను వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు, నా కుటుంబానికి పోలీసు భద్రత మరింత పెంచాలని కోరారు. అలాగే కౌంటింగ్ సరిగా నిర్వహించేలా అధికారులు చూడాలన్నారు. కుట్రలో భాగంగానే చెవిరెడ్డి ఇలాంటి దాడులకు తెగపడ్డారని వెల్లడించారు. అనుచరులు చేజారకుండా కావాలనే ఆయన మనుషులపై కేసులు పెట్టించారని తెలిపారు. పోలీసులకు ఇవ్వాల్సిన ఆధారాలను ఇచ్చాను. అమాయకులను కేసులో ఇరికించారు. చంద్రగిరి ప్రశాంతంగా చూడటమే నా లక్ష్యమన్నారు. రీపోలింగ్ చేస్తే మాకే పోలింగ్ శాతం పెరుగుతుందని తెలిపారు. ఎక్కడ గొడవలు జరగలేదు. కావాలని చెవిరెడ్డి రీపోలింగ్ అడిగినట్లు ఉన్నారని పులివర్తి నాని విమర్శించారు.

పులివర్తి నానిపై హత్యాయత్నం : అయితే పోలింగ్‌ జరిగిన మరుసటి రోజు (ఈనెల 14)న మహిళా విశ్వవిద్యాలయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించేందుకు పులివర్తి నాని వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడి తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందిన ఆయన ఇటీవల డిశ్చార్జి అయ్యారు. ఈకేసుకు సంబంధించి ఇప్పటి వరకు 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మరికొంత మంది దాడికి పాల్పడిన వారిలో ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఘటన జరిగిన సమయంలో నాని ప్రత్యక్షంగా చూసిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

రిటర్నింగ్‌ అధికారి సహాయంతోనే వైఎస్సార్సీపీ నేతలు దాడి చేశారు: పులివర్తి నాని - Pulivarthi Nani Interview

పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పురోగతి -13 మంది అరెస్ట్​ - Nani Case Update 11 Arrest

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.