Police File A Case Against Actor Raj Tarun : నటుడు రాజ్‌తరుణ్ లావణ్యల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వారివురు పరస్పర ఫిర్యాదులతో పోలీసుల ఎదుట హాజరవుతున్నారు. మాల్వీ వల్లే రాజ్ తనను దూరం పెట్టాడని లావణ్య అంటుంటే, అసలు రాజ్‌కు తనకు వృత్తిరీత్యా సంబంధమే తప్పా వ్యక్తిగతంగా సంబంధాలు లేవని మాల్వీ మల్హోత్రా పోలీసులకు తెలిపింది. కాగా లావణ్య మరోసారి రాజ్ తరుణ్‌పై తీవ్రఆరోపణలు గుప్పించింది.
నటుడు రాజ్ తరుణ్‌తో కలిసి అన్విక పేరుతో విదేశాలకు వెళ్లానని ఆమె ఆరోపించింది. అయితే రాజ్‌తరుణ్ తనకు ఒకసారి అబార్షన్ కూడా చేయించినట్లుగా ఆరోపణలు చేసింది. మరోవైపు రాయదుర్గం ఠాణాలో మాల్వీ మల్హోత్రా లావణ్యపై ఫిర్యాదు చేసింది. కాగా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆ కేసును ఫిలింనగర్ ఠాణాకు బదిలీ చేశారు.
రాజ్ తరుణ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు : మరోవైపు మాల్వీ సైతం ఫిలింనగర్ ఠాణాలో లావణ్యపై ఫిర్యాదు చేసింది. రాయదుర్గం నుంచి ఫిలింనగర్‌కు ట్రాన్ఫర్ అయిన కేసులో భాగంగా లావణ్య ఫిర్యాదు మేరకు మాల్వీని విచారణ కోసం పోలీసులు పిలిస్తే ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో లేనని, వచ్చిన తర్వాత పోలీసుల ఎదుట హాజరవుతానని ఆమె చెప్పినట్లుగా సమాచారం. కాగా, తన కుటుంబ సభ్యులను లావణ్య బెదిరింపులకు గురిచేస్తోందని మాల్వీ మల్హోత్రా ఆరోపణలు చేసింది. ఇవన్నీ కాకుండా లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్‌పై సెక్షన్ 420, 506, 493 కింద కేసు నమోదు చేశారు.
లావణ్య ఇప్పటికే తమకు కొన్ని ఫొటోలు చూపించిందని అవి ఆధారాలుగా ఎంతమేరకు పనిచేస్తాయో చూస్తామని పోలీసులు తెలిపారు. పూర్తిస్థాయి విచారణలో విషయాలన్నీ బయటకు వస్తాయని చెబుతున్నారు. ఆ తర్వాతే అన్ని విషయాలు చెప్పగలమని చెబుతున్నప్పటికీ, మాల్వీ మల్హోత్రా తమ జీవితంలోకి వచ్చాకే రాజ్‌తరుణ్ తనకు దూరమయ్యాడని లావణ్య తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
అటు ఇటీవలే ఈ వ్యవహారంపై రాజ్ తరుణ్ స్పందించాడు. లావణ్యకు తనకు సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. ఆమె డ్రగ్స్ తీసుకునేదని అప్పటినుంచి ఆమెను దూరం పెట్టినట్లు తెలిపాడు.
రాజ్‌తరుణ్ నుంచి నాకు ప్రాణ భయం ఉంది : నటి లావణ్య - Lavanya Comments on rajtarun
ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉంది - అందుకే వదిలేశా : రాజ్‌తరుణ్ - Police Case on Hero Raj Tharun