Police failure exposed in praja Galam Public Meeting: ప్రజాగళం సభలో పోలీసులు జనానికి చుక్కలు చూపించారు. పోలీసులకు సరైన ప్రణాళిక లేని కారణంగా ప్రజలతో పాటు ప్రదాని కూడా అసౌకర్యానికి గురికావాల్సి వచ్చింది. ప్రధాని మోదీ హాజరైన సభ విషయంలో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
మోదీ ప్రసంగానికి ఆటంకాలు: మోదీ మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తలు సౌండ్ సిస్టం వద్దకు వచ్చిన వారిని పోలీసులు నియంత్రించలేదు. దీంతో మోదీ ప్రసంగానికి పదేపదే ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆయన తన ప్రసంగాన్ని మూడుసార్లు ఆపాల్సి వచ్చింది. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తీరుపై వేదిక పైనుంచే అగ్రహం వెలిబుచ్చారు. పోలీసులు బాధ్యతలు వదిలేశారని వ్యాఖ్యానించారు. అలాగే సభకు తరలివస్తున్న ప్రజలతో పాటు టీడీపీ నాయకులను కూడా అడ్డుకోవటం విమర్శలకు తావిచ్చింది. బొప్పూడి సభకు వెళ్లే మార్గాల్లో ఇతర వాహనాలు దారి మళ్లించటంలో పోలీసుల వైపల్యం స్పష్టంగా కనిపించింది. అన్ని వాహనాలు జాతీయ రహదారి పైకి రావటంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
శాండ్, ల్యాండ్, వైన్, మైన్, అన్ని రంగాల్లో సీఎం జగన్ దోపిడీ: చంద్రబాబు
సభ కోసం 5వేల మంది పోలీసులు: ప్రకాశం జిల్లా నుంచి వచ్చే వాహనాలు మార్టూరు నుంచి బొప్పూడి వరకూ ఆగిపోయాయి. అలాగే గుంటూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల నుంచి వచ్చే వాహనాలు చిలకలూరిపేట నుంచి బొప్పూడి వరకూ నిలిచిపోయాయి. నరసరావుపే నుంచి చిలకలూరిపేట మార్గంలోనూ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసుల ప్రణాళికా లేమి స్పష్టంగా కనిపించింది. 5వేల మంది పోలీసులను సభ కోసం నియమించామని చెప్పినా వారు సభకు వస్తున్న జనాన్ని నియంత్రించటం కోసమే ఉన్నట్లు కనిపించింది. ట్రాఫిక్ సరిదిద్దటంపై దృష్టి సారించలేదు.
రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరుగుతుంది: పవన్ కల్యాణ్
20 కిమీ. మేర స్తంభించిన ట్రాఫిక్: సభా వేదిక ఎదురుగా 225 ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించినా అందులోకి వాహనాలను మళ్లించలేదు. దీంతో సభకు వచ్చిన వాహనాలు జాతీయ రహదారిపై ఆగిపోయాయి. దీంతో కొందరు వాహనాల్ని రోడ్డుపక్కనే ఆపి సభకు వెళ్లిపోయారు. జాతీయ రహదారి కూడా ఇరుకుగా మారిపోయిన పరిస్థితి. ట్రాఫిక్ లో చిక్కుకున్న వారు సభా ప్రాంగణానికి వచ్చేసరికి బాగా ఆలస్యమైంది. చంద్రబాబు ప్రసంగం ముగిసే వరకూ కూడా జనం వస్తూనే ఉన్నారు. బొప్పూడికి ఇరువైపులా జాతీయ రహదారిపై 20 కి.మీ.ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు సహకరించని కారణంగా రోడ్లపైనే చాలామంది జనం ఆగిపోవాల్సి వచ్చింది. పోలీసుల వైఖరిపై కూటమి నేతల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని అనుమానాలు వెలిబుచ్చారు.
చెరువు గట్లు, పొలాల గట్ల మీదగా సభకు: జాతీయ రహదారి పై ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయి ఎక్కడ వాహనాలు అక్కడ ఇరుక్కుపోయాయి. దీంతో చెరువుగట్లు, పొలాల గట్ల మీద నుంచి తమ అభిమాన నేతల ప్రసంగం వినేందుకు తరలివచ్చారు. ఒకవైపు ప్రసంగాలు జరుగుతున్నా మహిళలు, పిల్లలు, రైతులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. జాతీయ రహదారికి ఒకవైపు పూర్తిగా వాహనాలతో అభిమానులతో నిండిపోయింది.
అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి: ప్రధాని మోదీ