ETV Bharat / state

తెలంగాణలో ప్రధాని మోదీ రోడ్​షో - కాషాయమయమైన రహదారులు

PM Modi MP Election Campaign in Telangana : ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల మలివిడత ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ ఇవాళ మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో పాల్గొన్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్‌ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీలో, అశేష జనవాహిని స్వాగతం పలికింది. దీంతో రోడ్లన్నీ కాషాయమయంగా మారాయి.

PM Modi Election Campaign
PM Modi Election Campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 8:04 PM IST

తెలంగాణలో ప్రధాని మోదీ రోడ్​షో - కాషాయమయమైన రహదారులు

PM Modi MP Election Campaign in Telangana : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అగ్రనేతలు ప్రచాబరిలోకి దిగారు. పదిరోజుల వ్యవధిలోనే తెలంగాణలో మరోసారి అడుగుపెట్టిన ప్రధాని మోదీ, నేటి నుంచి మూడురోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పార్లమెంట్​ ఎన్నికల(Parliament Elections) మలివిడత ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి విచ్చేసిన మోదీకి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఇటీవల మరికొంతమంది బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

రాష్ట్ర పర్యటన నిమిత్తం కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని, అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో మల్కాజిగిరి చేరుకున్నారు. నియోజకవర్గ పరిధిలో బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ మోదీ రోడ్​షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, ఎంపీ అభ్యర్థి ఈటల రాజేెందర్​ సహా పలువరు బీజేపీ నేతలు పాల్గొన్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్‌ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర సాగిన భారీ ర్యాలీలో(BJP Rally) పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. అశేష జనవాహినితో రోడ్లన్నీ కాషాయమయంగా మారాయి. దీంతో సర్వత్రా మోదీ నామజపంతో మల్కాజిగిరి ఒక్కసారిగా మార్మోగింది.

'వచ్చే ఐదేళ్లలో జెట్​ స్పీడ్​లో అభివృద్ధి- ఇండియా కూటమికి నిద్రపట్టడం లేదు!'

PM Modi Telangana Tour Schedule : రోడ్​షో అనంతరం రాజ్​భవన్​కు ప్రధాని పయనమయ్యారు. కాగా శనివారం నాగర్‌కర్నూల్‌లో జరగనున్న బహిరంగ సభకు(Public Meeting) ప్రధాని పాల్గొంటారు. ఇది నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ పార్లమెంట్​ స్థానాలు లక్ష్యంగా జరగనుంది. అలాగే ఈ నెల 18న ప్రధాని జగిత్యాల బహిరంగ సభలో పాల్గొంటారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి ఎంపీ స్థానాలే లక్ష్యంగా దానికి రూపకల్పన చేశారు.

ఇప్పటికే ప్రధాని మోదీ ఈ నెల 4, 5 తేదీల్లో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల తొలివిడత ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్‌, పటాన్‌చెరు బీజేపీ విజయ సంకల్ప సభల్లో(BJP Vijaya Sankalpa Sabha) పాల్గొన్నారు. అలాగే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఒక రోజు హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

'అభివృద్ధితో విపక్షాల బుజ్జగింపు విషం బలహీనం- వికసిత్ భారత్​గా దేశాన్ని మార్చడమే నా టార్గెట్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.