ETV Bharat / state

హత్యలు, అరాచకాలు, వేల కోట్ల ఆస్తులు - 'ఏపీ నయీమ్​ పిన్నెల్లి'పై టీడీపీ బుక్​ - Pinnelli Paisachikam Book - PINNELLI PAISACHIKAM BOOK

Pinnelli Paisachikam Book Released By TDP Leaders : 8హత్యలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలపై 79దాడులు, 2వేల కోట్ల రూపాయలకు పైగా అక్రమార్జన.. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి, ఆయన సోదరుల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణలో కరడుగట్టిన నేరస్థుడు నయీమ్​ను తలదన్నేలా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులు, దౌర్జన్యాలపై 'పిన్నెల్లి పైశాచికం' పేరుతో టీడీపీ నాయకులు పుస్తకాన్ని విడుదల చేశారు.

tdp_leaders_release_book
tdp_leaders_release_book (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2024, 9:15 AM IST

Updated : May 29, 2024, 10:41 AM IST

Pinnelli Paisachikam Book Released By TDP Leaders : పల్నాడు జిల్లా మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడి మాఫియాపై తెలుగుదేశం పుస్తకం విడుదల చేసింది. పిన్నెల్లి పైశాచికం పేరుతో విడుదల చేసిన ఈ పుస్తకంలో ఏళ్లుగా మాచర్లలో సోదరులు చేసిన అరాచకాలను కళ్లకు కట్టింది. ముఖ్యంగా 2019 నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై దాడులు, దాష్టీకాలను వివరించింది. అదే సమయంలో పిన్నెల్లి అక్రమార్జనను సైతం పేర్కొంది.

‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో తెలుగుదేశం 28 పేజీలతో రూపొందించిన పుస్తకం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మాచర్ల నియోజకవర్గాన్ని ప్రైవేటు ఎస్టేటుగా మార్చుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అక్కడ సహజ వనరులను కొల్లగొట్టారని టీడీపీ పార్టీ ధ్వజమెత్తింది. ప్రశ్నించిన వారిపై పైశాచికంగా దాడులకు పాల్పడి మారణహోమం సృష్టించారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. ప్రజలంతా తమ బానిసలనే విధంగా మాచర్లలో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వేధించారని వ్యాఖ్యానించారు. పిన్నెల్లి దోపిడీ రూ. 2 వేల కోట్లని ఆరోపించింది. ‘2011-12 సంవత్సరంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదాయం రూ. 1.95 లక్షలుంటే ఇప్పుడు అధికారికంగా రూ. 43 లక్షలు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు.

అదిగో పిన్నెల్లి- కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన కాసేపట్లోనే ప్రత్యక్షం - PINNELLI IN PALNADU

హత్యలు, అరాచకాలు, 2వేల కోట్ల ఆస్తులు - 'ఏపీ నయీమ్​ పిన్నెల్లి'పై టీడీపీ బుక్​ (ETV Bharat)

పిన్నెల్లి ఆస్తులు అనధికారికంగా ఏటా రూ. 250 కోట్లకుపైనే ఉంటుందని పుస్తకంలో తెలిపింది. అప్పులతో ఊరొదిలి పారిపోయిన పరిస్థితి నుంచి వేల కోట్లకు పడగలెత్తారని పేర్కొంది. అధికారికంగా ప్రకటించిన ఆస్తుల వివరాలను అందులో వివరించారు. రెంటాలలో తెలుగుదేశం ఏజెంటుగా ఉన్న చేరెడ్డి మంజులపై దాడి చేసి తలకు తీవ్ర గాయం చేయడం, కారంపూడిలో తెలుగుదేశం కార్యాలయ ధ్వంసం, పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం తదితర చిత్రాలు పుస్తకంలో ఉన్నాయి.

పిన్నెల్లి రోజూ హాజరు కావాల్సిందే- షరతులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : హైకోర్టు - PINNELLI BAIL

పిన్నెల్లి మాఫియా 8 హత్యలు చేసిందని, అన్ని వర్గాలపై 79 దాడులు చేసిందని పుస్తకంలో తెలుగుదేశం పార్టీ వివరించింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడటంతోపాటు తెలుగుదేశం జెండా పట్టుకుని తిరిగారంటూ గుండ్లపాడులో తెలుగుదేశం నాయకుడు చంద్రయ్యను దారుణంగా హతమార్చారని దుయ్యబట్టింది. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను కలిసేందుకు వెళ్లిన బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలపై మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరుడు తురకా కిశోర్‌ హత్యాయత్నం చేశారని పొందుపరిచింది. 30 కిలోమీటర్ల మేర వెంటాడి రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారని తెలిపింది.

'ఎన్నికల కేసుల్లో' నిందితులుగా ఉన్న అభ్యర్థులకు హైకోర్టులో ఊరట- జూన్​ 6 వరకు నో అరెస్ట్​ - PINNELLI ARREST Case

తాగునీరు అడిగిన నేరానికి రెంటచింతల మండలం మల్లవరం తండాలో బాణావత్‌ సామునిబాయ్‌ను హతమార్చారని ఎన్నికల సందర్భంగా మొత్తం 79 దాడులు చేయగా అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపైనే 51 ఉన్నాయని వివరించింది. మాచర్ల పట్టణం, కంభంపాడు, ఒప్పిచర్ల, కేపీగూడెం, కొత్తూరు, రెంటాల, కాకానివారిపాలెం, తుమృకోట, కండ్లకుంట, పోలేపల్లి, పాల్వాయిగేటు, రాయవరం, పట్లవీడు తదితర ప్రాంతాల్లో బాధితుల పేర్లతో కూడిన జాబితాను ప్రస్తావించారు. ఆత్మకూరులో దళితుల బహిష్కరణ, పోలింగ్‌ కేంద్రాన్ని వదిలి వెళ్లాలంటూ ఏజెంటుకు వీడియోకాల్‌ తదితర సంఘటనల గురించి పుస్తకంలో వివరించారు.

మాచర్లలో పిన్నెల్లి అరాచకాలెన్నో- ఒక్కొక్కటిగా వెలుగులోకి! - YSRCP Leaders Attack

Last Updated : May 29, 2024, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.