ETV Bharat / state

తెలంగాణలో పీజీఈసెట్​ పరీక్షలు వాయిదా - కారణమిదే - TS PGECET Exam Postponed

author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 7:47 PM IST

PGCET Exams Postponed in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్ పరీక్షను పోస్ట్​పోన్ చేస్తూ జేఎన్​టీయూహెచ్ నిర్ణయించింది. గ్రూప్ 1, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల నేపథ్యంలో పీజీఈసెట్ పరీక్షా తేదీలను మారుస్తునట్టు ప్రకటించింది. జూన్ 6 నుంచి 9 వరకు జరగాల్సిన పీజీఈసెట్, జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నట్టు ప్రకటనలో పేర్కొంది.

TS PGECET Exam Dates 2024
TS PGECET Postponed (eenadu.net)

TS PGECET Exam Postponed : తెలంగాణ వ్యాప్తంగా ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మ్‌ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్‌ పరీక్షను వాయిదా వేయాలని జేఎన్టీయూహెచ్‌ నిర్ణయించింది. గ్రూప్-1 ఎగ్జామ్స్, స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ పరీక్షల నేపథ్యంలో పీజీఈసెట్‌ పరీక్ష తేదీల్లో స్వల్పమార్పులు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ ఏ అరుణ కుమారి ప్రకటించారు. ఈ క్రమంలోనే జూన్ 6 నుంచి 9 వరకు జరగాల్సిన పీజీఈసెట్‌ను జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని, మరింత సమాచారం కోసం ఉన్నత విద్యామండలి వెబ్​సైట్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పీజీఈసెట్‌ పరీక్షను వాయిదా వేయాలని జేఎన్టీయూహెచ్‌ నిర్ణయించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.