Person From Vikarabad of Telangana Got Job With 2Cr Package in Amazon : తెలంగాణలోని వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన యువకుడికి అరుదైన అవకాశం దక్కింది. అర్బాజ్ ఖురేషీ అనే యువకుడు ప్రఖ్యాత ఐటీ కంపెనీ అమెజాన్‌లో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో అప్లైడ్ సైంటిస్ట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ ఉద్యోగంలో ఆయన నేడు (సోమవారం) చేరుతున్నారు. 2019లో ఐఐటీ పట్నా నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆయన మూడో సంవత్సరంలో ఫ్రాన్స్‌కు చెందిన మెషీన్ లెర్నింగ్ కోవిదుడు గేల్ డయాస్ దగ్గర మూడు నెలలు ఇంటర్న్‌షిప్ చేశారు.
అనంతరం బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌లో రెండు సంవత్సరాలు పని చేశారు. 2023లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ నుంచి ఏఐ, మెషీన్ లెర్నింగ్లో ఎంఎస్ పట్టా పొందారు. ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్లోనూ ఇంటర్న్‌షిప్ చేసే అవ కాశం దక్కింది. అర్బాజ్ ఖురేషీ అమెజాన్‌లో శాస్త్రవేత్తగా ఉద్యోగం పొందడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. యువకుడి తండ్రి యాసిన్ ఖురేషీ ప్రస్తుతం ఎక్సైజ్ జాయింట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు.
ఉద్యోగం వద్దనుకుని పొలం బాట పట్టాడు - లాభాలు గడిస్తున్నాడు - YOUNG FARMER EARNING MORE