People Using White Sorghum as Talambralu: వధువు, వరుడు ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోయడం వివాహ వేడుకలో చూడముచ్చటైన ఘట్టం. అయితే పసుపు కలిపిన బియ్యాన్ని తలంబ్రాలుగా వాడటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కానీ, ఓ వర్గం వారు మాత్రం తెల్లజొన్నలను అక్షతలుగా వాడుతూ విభిన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆరె, ఆరె క్షత్రియ, ఆరోళ్ల సామాజిక వర్గాల ప్రజలు వివాహ మహోత్సవాల్లో నెయ్యి, పసుపు కలిపిన తెల్లజొన్నలను తలంబ్రాలుగా ఉపయోగిస్తారు. ఈ తెల్లజొన్నలు పండించడం వారి ప్రధాన వ్యవసాయ వృత్తి. అయితే వారి వృత్తిని గౌరవించుకునేందుకు గుర్తుగా పూర్వం నుంచి ఆ సామాజిక వర్గ ప్రజలు తమ ఇళ్లలో జరిగే వివాహ వేడుకల్లో తెల్లజొన్నలను అక్షతలుగా వాడుతూ తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు.
'జై భీమవరం రాజులు' - ప్రభాస్ పంపిన భోజనం తిని కుంభకర్ణుడిలా పడుకున్న జగ్గూ భాయ్
ఆధునిక దేవాలయానికి 69 ఏళ్లు - రాతి కట్టడాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్