People Suffering from Sewage in Vijayawada: విజయవాడలోని పలు కాలనీల్లో మురుగు కాలువల పరిస్థితి అధ్వానంగా తయారయ్యింది. నగర అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని చెప్పుకుంటున్న పాలకులు ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. నివాస స్థలాల మధ్య ఉండే ఓపెన్ డ్రైన్లు ప్రమాదకరంగా మారాయి. గతంలో ఈ ఓపెన్ డ్రైన్లలో పడి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి అనేక హామీలు ఇచ్చారు ఏళ్లు గడుస్తున్నా తాము ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ డ్రైన్లపై మూతలు ఏర్పాటు చేయాలని అనేక సార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహానగరంలో మురుగు సమస్య - బెజవాడ అభివృద్ధికి బ్రేకులు
నగరంలోని దర్శిపేట, అంబేద్కర్ నగర్ కాలనీ, నల్లూరి సత్యనారాయణ నగర్ ప్రాంతాల్లో మురుగు కాలువలతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మురుగు కాలువ నిర్వాహణ సరిగ్గా లేకపోవడంతో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రజలు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో దోమలు, ఈగలు ఎక్కువగా ఉండడంతో ఇంటిలో నుంచి బయటకు రాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మురుగు కాలవల నుంచి వచ్చే దుర్వాసనతో ఇంటిలోనూ ఉండలేని పరిస్థితి ఏర్పడిందని చుట్టుపక్కల ప్రజలు వాపోతున్నారు.
దర్గాపై వైసీపీ నాయకుల నిర్లక్ష్యం - చుట్టూ మురుగు పారుతూ దుర్గంధంతో భక్తుల అవస్థలు
ప్రమాదకరమైన ఈగలు, దోమల కుట్టడంతో చిన్నపిల్లల సైతం అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో ఉన్న డ్రైన్లపై మూతలు వేస్తామని, ప్రస్తుతం ఉన్న పాత డ్రైన్ల స్థానంలో కొత్త మురుగు కాలువలను నిర్మిస్తామని చెప్పిన పాలకులు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శిపేటలో శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి దేవస్థానం పక్కనే ప్రమాదకర స్థాయిలో ఓపెన్ మురుగు కాలువ ఉంది. ఈ ఆలయానికి నిత్యమూ పదులు సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వాళ్లంతా ఈ కాలువల నుంచి వచ్చే దుర్వాసన కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. దుర్గంధంతో పాటు దోమలు, ఈగలు ఎక్కువగా ఉండడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని భక్తులు చెబుతున్నారు.
డంపింగ్ యార్డును తలపిస్తున్న ధవళేశ్వరం- పట్టించుకోండి మహాప్రభో!
ఈ ఆలయంతోపాటు ఓ మసీదు ఉంది. ఇక్కడకు వచ్చే భక్తులు సైతం ఈ మురుగు కాలువల కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నివాస ప్రాంతాల మీదుగా ప్రవహిస్తున్న మురుగు కాలువను ఇతర ప్రాంతాల గుండా పారేదానికి ప్రణాళికలు రచించినా పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ నూతన కాలువ నిర్మాణం కోసం సుమారు 90 లక్షల రూపాయలు గతంలో ప్రభుత్వం కేటాయించింది. అయితే పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం పూనుకోవడం లేదు. దీంతో ఇక్కడ మురుగు కష్టాలు తీరడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.