ETV Bharat / state

విజయవాడ నగరవాసులపై దోమల దండయాత్ర - రోగాలబారిన పడుతున్న ప్రజలు - Mosquitoes in Vijayawada

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 1, 2024, 8:29 AM IST

People Suffering from Mosquitoes in Vijayawada : విజయవాడ ప్రజలను దోమల బెడద వేధిస్తోంది. పారిశుద్ధ్యం పడకేయడంతో ఎక్కడికక్కడ మురుగు పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో విషజ్వరాలు ప్రబలి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

sanitation_problem
sanitation_problem

విజయవాడ నగరవాసులపై దోమల దండయాత్ర - రోగాలబారిన పడుతున్న ప్రజలు

People Suffering from Mosquitoes in Vijayawada : విజయవాడలో దోమలు, ఈగల బెడద తీవ్రంగా ఉంది. స్లమ్ ఏరియాల్లోనే కాదు. ఇతర ప్రాంతాల్లోనూ దోమలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో నగర ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో సతమత అవుతున్నారు. పలు కాలనీల ప్రజలు అధికారులకు అనేక సార్లు ఇదే విషయాన్ని మొరపెట్టుకున్నా ఫలితం ఆశించిన స్థాయిలో రాలేదు. ఏదో ఒకటి రెండు సార్లు వచ్చి దోమల మందులు కొట్టి వీఎంసీ సిబ్బంది వెళ్లిపోతున్నారని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాంబే కాలనీ వాసుల వ్యధ - ఈ నీరు తాగేదెలా? - Drinking Water Problem

Sanitation Problem in Vijayawada : నగర శివారుల్లో సమస్య మరీ తీవ్రంగా ఉండటంతో అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. చిన్నపిల్లలతో పాటు పెద్దలూ అనారోగ్యం పాలు అవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేస్తూ మౌలిక వసతులు కల్పించటంలేదని ఆరోపిస్తున్నారు.

" ప్రభుత్వం ప్రజలు నుంచి పన్ను వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ పారిశుద్ధ్యంలో కనిపించడం లేదు. నిత్యం దోమలతో నరకయాతన పడుతున్నాము. నగర పాలక అధికారులకు ఈ విషయంలో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లేదు. దోమల కాటు వల్ల విషజ్వరాలతో అల్లాడిపోతున్నాము " _ విజయవాడ వాసులు

విజయవాడలో అగ్నిప్రమాదం - ఆయిల్‌ శుద్ధి కేంద్రంలో భారీగా వ్యాపించిన మంటలు - Fire Accident In Vijayawada

Mosquitoes in Vijayawada : సాయంత్రం నాలుగు గంటల తరువాత దోమలు ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి. వీఎంసీ సిబ్బంది మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం పూర్తి స్థాయిలో తొలగించడం లేదు. మరికొన్ని కాలనీల్లో రోడ్లపై నీరు నిల్వ ఉండడంతో దోమల తీవ్రత అధికంగా ఉంటున్నాయి. విషజ్వరాలతో పాటు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నగరంలోని వాంబేకాలనీ, మధురానగర్, గుణదల వంటి ప్రాంతాల్లో దోమలు అధికంగా ఉంటున్నాయి. ఉదయం సాయంత్రం సమయాల్లో దోమలు విపరీతంగా కుడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
బెజవాడ బస్టాండ్​లో భద్రతా వైఫల్యం - బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి మూకలు హల్​చల్ - Pandit Nehru Bus Station

దోమల దండయాత్రకు విజయవాడలోని పలు కాలనీల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికైనా నగర పాలక అధికారులు చర్యలు తీసుకొని తమ ప్రాంత వాసులను దోమల బెడద నుంచి రక్షించవలసిందిగా కోరుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.