ETV Bharat / state

పొంగుతున్న గోదావరి, శబరి- నీట మునిగిన ఇళ్లు, పొలాలు - GODAVARI FLOOD - GODAVARI FLOOD

People Suffering From Floods: గోదావరి, శబరి నదుల వరద కారణంగా అల్లూరి, కోనసీమ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శబరి నది వంతెన మునిగిపోవడంతో చింతూరు డివిజన్​లోని మండలాల్లోని ఇళ్లు మునిపోయాయి. గోదావరి ఉద్ధృతితో పంటలు నీళ్లలో నానిపోయి కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రాంతాల బాధితులకు శరవేగంగా సాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు.

People Suffering From Floods
People Suffering From Floods (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 2:22 PM IST

Updated : Jul 28, 2024, 3:31 PM IST

People Suffering From Floods : వరదలు వచ్చాయంటే ఆ ప్రాంతాలు ఓ వైపు శబరి నది, మరోవైపు గోదావరి నదుల ప్రవాహంతో ముంపునకు గురవుతున్నాయి. గోదావరి, శబరి నదులకు సంభవించిన వరదలు తగ్గినట్లే తగ్గి వరదతో మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్నాయి. దీంతో అల్లూరి జిల్లా శివారు చింతూరు డివిజన్​లో కూనవరం, వీఆర్​పురం మండలాలు నీట మునిగడంతో గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు తరలించారు. రెండు రోజుల క్రితం జాతీయ రహదారిపై రాకపోకలు ప్రారంభం కాగా వరద నీరు ముంచెత్తడంతో మళ్లీ రాకపోకలు నిలిచిపోయాయి. వారం రోజులుగా విలీన మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన - పెద్ద వాగు సమస్య తీరుస్తామని భరోసా - Ministers Visited Flood Areas

వరదలో మునిగిపోయిన ఇళ్లు: వర్షాలు తగ్గుముఖం పట్టిన వరద నీటితో కూనవరం మొత్తం నీట మునిగింది. గ్రామస్థులు పునరావాస కేంద్రాలకు తరలిపోయారు. వీఆర్​పురం - కూనవరం మధ్య ఉన్న శబరి నది వంతెన మునిగిపోయింది. ప్రస్తుతం గ్రామస్థులు కూనవరం వీధుల్లో పడవ ప్రయాణం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్, బస్టాండ్​లోని ప్రయాణికుల షెల్టర్​తోపాటు ఇళ్లు మొత్తం మునిగిపోయాయి. వీధుల్లో పడవల్లో ప్రయాణించాల్సి వస్తుందని శాశ్వత పరిష్కారం చూపాలని అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

చింతూరు- వరరామచంద్రపురం మండలాల మధ్య చీకటి వాగు, సోకులేరు వద్ద ప్రధాన రహదారులపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు జరగడం లేదు. ముకునూరు, ఏజీకొడేరు, పెదశీతనపల్లి పంచాయతీల పరిధిలో సుమారు 50 గ్రామాలకు పైగా మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. శబరి నది వరదలతో చింతూరు వచ్చే ప్రధాన రహదారిపై వరద చేరుకుంది. ఈ రహదారిలోని పలు దుకాణ సముదాయాలు వరదలో మునిగిపోయాయి.

ధవళేశ్వరం వద్ద 13.90 అడుగులకు చేరిన నీటిమట్టం - రెండో ప్రమాద హెచ్చరిక జారీ - SECOND WARNING AT DAWALESWARAM

పంటలు నష్టపోతామని రైతులు ఆవేదన: గోదావరి ఉద్ధృతి కారణంగా కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని లంక గ్రామాలు, పంట పొలాలు సైతం పూర్తిగా జలమయమయ్యాయి. గురజాపులంక, కూనాలంక, ఠానేలంక తదితర గ్రామాల్లోని కురగాయల పంటలు వారం రోజులుగా నీళ్లలో నాని కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు సహసోపేతంగా వరద నీటిలో దిగి బెండకాయలు కోస్తున్నారు. వరద లో తీవ్ర అవస్థలు పడుతున్నామని మహిళలు చెబుతున్నారు.

గోదావరి వరద ప్రాంతాల బాధితులకు శరవేగంగా సాయం అందిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. ముప్పును ముందే అంచనా వేసి వరద చుట్టుముట్టడానికి ముందే 60 శాతం ప్రాంతాల్లో సరకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యుత్‌ సౌకర్యం పునరుద్ధరణ మినహా మిగిలిన అన్నిరకాల సాయం కలెక్టర్ దినేష్ కుమార్‌ అందించామన్నారు.

క్షణక్షణం ఆందోళన రేకెత్తిస్తున్న గోదావరి ప్రవాహం- వరద గుప్పిట్లోనే లంక గ్రామాలు - GODAVARI FLOOD

Last Updated : Jul 28, 2024, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.