ETV Bharat / state

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణమ్మ ఉగ్రరూపం - ఊళ్లకు ఊళ్లే నీటమునక - Flood Effect in Joint Guntur

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 9:53 AM IST

People Suffer Due to Flood Effect in Joint Guntur District : కృష్ణమ్మ ఉగ్రరూపానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు గ్రామాలు వరద నీటితో నిండిపోయాయి. చాలాచోట్ల కరకట్టకు గండ్లు పడడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గ్రామస్థులు గడుపుతున్నారు. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లంక గ్రామాలను వరద ముంచెత్తడంతో వారందరినీ ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలించారు.

flood_effect
flood_effect (ETV Bharat)

People Suffer Due to Flood Effect in Joint Guntur District : కృష్ణానది వరద పల్నాడు జిల్లా వాసులను ముప్పతిప్పలు పెడుతోంది. ఎగువున కురుస్తున్న వానలకు నదీ పరివాహక ప్రాంతంలో వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. కరకట్టలు బలహీనపడటంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లంక గ్రామాలను వరద ముంచెత్తడంతో వారందరినీ ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలించారు. వర్షం ముప్పు పూర్తిగా తొలగని నేపథ్యంలో నదీతీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్థులు : కృష్ణమ్మ వరద ఉద్ధృతికి గుంటూరు జిల్లాలోని హరిశ్చందపురం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అమరావతి విజయవాడ ప్రధాన మార్గంలో ఉన్న ఈ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గ్రామంలో ఉన్న ఇళ్లను వరద ముంచెత్తింది. అధికారులు కూడా గ్రామంలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గ్రామస్థులు డాబాలపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అమరావతి-విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

వరద ఉద్ధృతికి ఉమ్మడి గుంటూరు జిల్లా అతలాకుతలం - లంక గ్రామాలు జలమయం - Flood Effect in Guntur District

ఊళ్లకు ఊళ్లే నీటమునక : పల్నాడు జిల్లాలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ఊళ్లను ముంచింది. అమరావతి మండలంలోని నదీతీర గ్రామాల్లో వరద పోటెత్తింది. పెదమద్దూరు, వైకుంఠపురం గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం నుంచి ఈ రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మేళ్లవాగు, నక్కవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వేలాది ఎకరాలు చెరువుల్లా మారాయి. పొలాలు ఉన్నాయన్న ఆనవాళ్లు కనుచూపుమేరలో కనిపించకుండా ఎనిమిది అడుగుల మేర నీరు ముంచెత్తింది. ఈ రెండు ఊళ్లల్లో 6 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం స్థానికంగానే ఉంటూ ఎప్పటికప్పుడు సహాయకచర్యలను పర్యవేక్షించారు. కరకట్ట ప్రాంతంలో వరద ఉద్ధృతి దృష్ట్యా గ్రామస్థులందరినీ పునరావాస శిబిరాలకు తరలివెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

కృష్ణమ్మ మహోగ్రరూపం - విలవిల్లాడుతున్న లంక గ్రామాలు - క్షణం క్షణం కమ్మేస్తోన్న వరద - Krishna River Floods

అమరేశ్వరుడి పాదాలను తాకిన కృష్ణమ్మ : యాభైఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో అమరేశ్వరుడి పాదాలను కృష్ణమ్మ తాకింది. పైనుంచి పోటెత్తుతున్న వరదతో అమరావతి వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏక్షణం ఎటునుంచి వరద ముంచుకొస్తుందోనని సమీప కాలనీవాసులంతా రాత్రుళ్లు నిద్రలేకుండా డాబాలకే పరిమితమయ్యారు. ఆలయం వెనుక ఉన్న పూజారి బజార్, పల్లపువీధి, సంధ్యా థియేటర్‌ బజార్, శివగంగ వీధి, క్రోసూరు రోడ్డు, ముస్లింకాలనీ, సాయిబాబా, ప్రసన్నాంజనేయస్వామి, అయ్యప్పస్వామిదేవాలయాలు, ధరణికోట జైల్‌సింగ్‌ కాలనీ వరద నీటితో నిండిపోయాయి. ఐదు అడుగుల మేర కాలనీల్లో నీరు చేరింది. అధికారులు, సిబ్బంది తమ ఇబ్బందుల్ని పట్టించుకోవడం లేదని ముంపు కాలనీ వాసులు ఆరోపించారు. తాగునీరు కూడా లేక చిన్నారులతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

వరద ధాటికి సొంతూళ్లకు పయనం - బస్సుల్లేక బస్టాండ్‌లో బాధితుల తిప్పలు - PEOPLE FACE TO TRANSPORT PROBLEM

జలదిగ్బంధంలో ధ్యాన బుద్ధవనం : అమరావతిలోని ధ్యాన బుద్ధవనం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. తహసీల్దార్‌ కార్యాలయం, పోలీసుస్టేషన్‌ల్లోకి నీళ్లు చేరాయి. కృష్ణాతీర ప్రాంత గ్రామాల్లో పులిచింతల నుంచి వైకుంఠపురం వరకు ఉన్న సుమారు 18 గ్రామాల ప్రజలంతా ఏం జరుగుతుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వరద రోడ్లపై ప్రవహించడంతో అమరావతి నుంచి విజయవాడ, క్రోసూరు, గుంటూరు మార్గాల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.

బుడమేరు ప్రళయం ఎఫెక్ట్ - వరద గుప్పిట్లో అల్లాడుతున్న జనం - Vijayawada Floods

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.