ETV Bharat / state

హైదరాబాద్​ నుంచి ఏపీకి తరలి వచ్చేందుకు ఓటర్లు సిద్ధం - రైళ్లు, బస్సుల్లో సీట్లన్నీ ఫుల్​ - People Ready to vote - PEOPLE READY TO VOTE

People Ready to Vote in AP : మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు సిద్దం అయ్యారు. ఉద్యోగ, విద్య కారణాల వల్ల ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఓటు వేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో రైళ్లు, బస్సులలో సీట్లన్ని నిండుకున్నాయి. రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు, బస్సులు వెయ్యాలని అధికారులను కోరుకుంటున్నారు.

people_ready_for_vote
people_ready_for_vote (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 9:11 AM IST

హైదరాబాద్​ నుంచి ఏపీకి తరలి వచ్చేందుకు ఓటర్లు సిద్ధం - రైళ్లు, బస్సుల్లో సీట్లన్నీ ఫుల్​ (ETV Bharat)

People Ready to vote in AP : రాష్ట్రం వెలగాలి అంటే ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అందుకు తగ్గట్టుగానే జనం రాజ్యాంగ పండుగకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రా ఓటర్లు సైతం ఓటెత్తేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రానుండడంతో రైళ్లు, బస్సులు సరిపోవడం లేదు. ఐనా సరై ఏలాగైనా వస్తాం, సరైన ప్రభుత్వాన్ని స్థాపిస్తామంటూ ప్రతిన బూనారు.

People Move From Hyderabad to AP : రాష్ట్రంలో సోమవారం ( మే 13న) జరగనున్న సార్వత్రిక సమరానికి ప్రజలు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో రాష్ట్రానికి వచ్చేందుకు జనం సిద్ధమయ్యారు. రాష్ట్రానికి వచ్చే బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి. ఏపీఎస్​ఆర్టీసీ, టీఎస్​ఆర్టీసీ అన్న తేడా లేకుండా అన్ని బస్సులు ఫుల్‌ అయిపోయాయి. ఈ రద్దీని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. అడ్డగోలుగా ఛార్జీలు పెంచేశారు. హైదరాబాద్​ నుంచి విశాఖపట్నం ప్రైవేటు స్లీపర్ బస్సు టికెట్ ధర ప్రస్తుతం 4 వేల రూపాయలు ఉందని ప్రజలు వాపోతున్నారు. రద్దీకి తగ్గ విధంగా మరిన్ని బస్సులు కేటాయించాలని కోరుతున్నారు.

" ఏపీలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి తప్పకుండా వెళ్తున్నాము. రైళ్లు, బస్సులు పూర్తిగా నిండిపోయాయి. ప్రైవేటు వాహనంలో వెళ్లి అయిన తప్పకుండా ఓటు వేస్తాం. మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే ఓటు హక్కును వినియోగించుకోవాలి. రైళ్లు, బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది " -ఓటర్లు

'సంక్షేమం, అభివృద్ధి కాంక్షించే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సిద్ధం' - Ap Voters In Hyderabad

Voters Traveling Problem : సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలామంది ఉద్యోగులు శుక్ర, శనివారాల్లో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. రైలులో వెళ్దామనుకునే వారికి నెల క్రితమే సీట్లు అయిపోయి వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంది. పలు రైళ్లు ఏకంగా రిగ్రేట్‌కు వెళ్లిపోయాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం, కాకినాడ, విజయవాడ, నర్సాపురం వైపు వెళ్లే రైళ్లలో మే 12న రిజర్వేషన్లు పూర్తయి పోయాయని ఓటర్లు తెలియజేశారు. తిరుపతి, నెల్లూరు వైపు వెళ్లే రైళ్లలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. సొంత వాహనాల్లోనైనా వెళ్లి అభివృద్ది చేసే వారికే ఓటు వేస్తామని ఏపీ ఓటర్లు స్పష్టం చేస్తున్నారు.

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి- ప్రజల్లో అవగాహన సదస్సు - Voter Awareness Programme In Ongole

ఓటు వేయడానికి వెళ్లేవారికి గుడ్​న్యూస్, ఈ దారుల్లో స్పెషల్​ ట్రెయిన్స్​​ - అయినా దక్కని టికెట్లు - Special Trains For Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.