ETV Bharat / state

సిద్ధం సభతో వైసీపీ విధ్వంసం - సీమ ప్రజల అగచాట్లు ఒకవైపు, మందుబాబుల చిందులు మరోవైపు

People Problems with CM Jagan Siddam Sabha: రాష్ట్రంలోని ఏ ప్రాంతమైనా సీఎం జగన్ పర్యటనతో ప్రజలకు తిప్పలు తప్పటం లేదు. తాజాగా రాప్తాడు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న 'సిద్ధం' సభ కోసం పోలీసులు ఆంక్షలు విధించటంతో ప్రయాణికులతో పాటు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో వాహనాలను నిలిపివేయటంతో డ్రైవర్లు నానావస్థలు పడ్డారు. భోజనం లభించని అటవీ ప్రాంతంలో వాహనాలు నిలిపివేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు.

People_Problems_with_CM_Jagan_Siddam_Sabha

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 9:57 PM IST

సిద్ధం సభతో వైసీపీ విధ్వంసం - సీమ ప్రజల అగచాట్లు ఒకవైపు, మందుబాబుల చిందులు మరోవైపు

People Problems with CM Jagan Siddam Sabha: జగన్‌ సిద్ధం సభలతో ప్రజలకు అగచాట్లు తప్పడం లేదు. రాప్తాడు సభ కోసం ఆర్టీసీ 3వేలకు పైగా బస్సులను కేటాయించింది. రాయలసీమతో పాటు ఒంగోలు, గుంటూరు ప్రాంతాల నుంచి కూడా బస్సుల్ని తరలించడంతో బస్సుల్లేక ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. చిన్నారులు, వృద్ధులతో గంటలకొద్దీ నిరీక్షించినా బస్సుల జాడ లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. తిరుమల శ్రీవారి భక్తులకు సైతం అవస్థలు తప్పలేదు. మరోవైపు సీఎం సభకు వచ్చిన వారికి బస్సుల్లోనే డబ్బు, మద్యం పంపిణీ చేశారు. సభా ప్రాంగణంలోనే పోలీసుల ఎదుటే మందుబాబులు మద్యం సేవించి చిందులేశారు.

నిబంధనలకు విరుద్దంగా రాప్తాడులో జగన్ సభ- టీడీపీ సభలకు అనేక ఆంక్షలు : అచ్చెన్నాయుడు

ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న 'సిద్ధం' సభలతో ప్రజలకు నరకయాతన తప్పడం లేదు. రాప్తాడు సభ కోసం ఆర్టీసీ 3వేలకు పైగా బస్సులను కేటాయించడంతో బస్టాండ్‌లు బోసిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతపురం బస్టాండ్‌లో ఉదయం నుంచి ప్రయాణికులు గంటల తరబడి వేచిచూసి ఎప్పటికీ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చేసేదిలేక ఆటోల్లో గమ్యస్థానాలకు వెళ్లారు.

కదిరిలో ప్రయాణికులు గంటలపాటు బస్సుల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. చంటి పిల్లలు, వృద్ధులు బాగా ఇబ్బందిపడ్డారు. 110 బస్సులున్న కదిరి డిపోలో 72 బస్సులను సీఎం సభకు తరలించారు. ఫలితంగా తగినన్ని బస్సులు లేక వందల మంది ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు.

సత్యసాయి జిల్లా మడకశిరలోనూ బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోల్లో గమ్యస్థానాలకు వెళ్లారు. రద్దీతో కర్ణాటక బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సత్యసాయి జిల్లా మామిళ్లపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై భారీ వాహనాలను దారి మళ్లించారు. ఫలితంగా హైదరాబాద్‌ వెపు వెళ్లే వాహనాలకు 100 కిలోమీటర్ల దూరం పెరిగింది. ట్రాఫిక్‌ జామ్‌తో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.

సీఎం సభతో సామాన్యులకు తప్పని తిప్పలు - బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు

దీంతో పాటు 'సిద్ధం' బహిరంగ సభ కోసం 20 కిలోమీటర్ల దూరంలోని మామిళ్లపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై పోలీసులు సరుకు రవాణా వాహనాలను నిలిపివేశారు. మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలోనే వాహనాలను నిలిపివేయడంతో డ్రైవర్లు నానా అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం భోజనం లభించని అటవీ ప్రాంతంలో వాహనాలు నిలిపివేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేని ప్రాంతంలో ముందస్తు సూచన లేకుండా అర్ధాంతరంగా వాహనాలు నిలిపివేయటంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి సభ ఉన్నంతమాత్రాన జాతీయ రహదారిలో వాహనాలు నిలిపివేసే హక్కు ఎవరిచ్చారని విమర్శలు గుప్పించారు.

కర్నూలు బస్టాండ్‌లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి వేచిచూసి చివరికి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. నంద్యాల, ఆదోనిలోనూ ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. బస్టాండ్లు, రోడ్లపై గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. ప్రభుత్వ తీరుతో విసుగెత్తిన ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌, వైఎస్సార్సీపీ నేతలపై మండిపడ్డారు.

కడపలో కొత్త బస్టాండ్‌, పాత బస్టాండ్‌ మొత్తం నిర్మానుష్యంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 280 బస్సులను సభకు తరలించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రొద్దుటూరులో ప్రైవేటు విద్యాసంస్థలపై ఒత్తిడి తెచ్చి బ‌స్సులను తీసుకుని భారీగా జ‌నాన్ని త‌ర‌లించారు.

సీఎం సభ కోసం దారి మళ్లింపు- వందల కి.మీ చుట్టూ తిరిగెళ్లాల్సి వస్తోందని లారీ డ్రైవర్ల గగ్గోలు

తిరుపతి జిల్లాలో 374 బస్సులు తరలించడంతో తిరుపతి బస్‌స్టేషన్‌లో భక్తులు, ప్రయాణికులు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. అరకొర బస్సుల కోసం ప్రయాణికులు ఎగబడడంతో తోపులాట చోటుచేసుకుంది. తిరుపతి నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని వెల్లూరు, తిరువణ్ణామలై, కంచి, బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. కనీసం సమాధానం చెప్పేవారు కూడా లేరంటూ ప్రయాణికులు మండిపడ్డారు.

ప్రకాశం జిల్లాలో 7 డిపోల నుంచి 135 బస్సులను రాప్తాడు సభకు పంపారు. గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు లేక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఆర్టీసీ అధికారులను అడిగినా కనీస స్పందన లేదని ప్రయాణికులు వాపోయారు. సిద్ధం సభ వద్ద మద్యం ఏరులై పారింది. కదిరిలో మద్యం దుకాణం వద్దే నోట్ల కట్ట పట్టుకొని మనిషికి 500 రూపాయల చొప్పున పంపిణీ చేశారు.

డబ్బు తీసుకున్న వారు వెంటనే అక్కడే జగనన్న మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేశారు. వారికి ఉడికించిన కోడిగుడ్డు, బిర్యానీ ప్యాకెట్ అందజేశారు. తర్వాత అందర్నీ బస్సులు ఎక్కించి సభా ప్రాంగణానికి తరలించారు. అక్కడికి చేరుకున్నాక చెట్ల నీడ వెతుక్కుంటూ వెళ్లి బృందాలుగా కూర్చొని మద్యం సేవించారు. సభ సమీపంలోనే పోలీసుల ముందే బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించారు.

చేతిలో వైఎస్సార్సీపీ జెండాలు, తలపై టోపీలు పెట్టుకొని మద్యం సేవించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే జనాన్ని గ్యాలరీల్లోకి పంపారు. సభకు అర కిలోమీటరు దూరంలో ఉన్న దుకాణాలను మూయించిన పోలీసులు చిరు వ్యాపారుల పొట్టకొట్టారు. మాంసం దుకాణాలు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు మూయించటంతోపాటు, రోడ్డు పక్కన తోపుడు బండ్లను కూడా పెట్టనీయకుండా చేశారు.

బందోబస్తుగా వచ్చిన పోలీసులకు సరిపడా భోజనం సరఫరా చేయలేకపోయారు. భోజనం పంపిణీ చేసే వాహనం సభ సమీపంలోకి రాగానే పోలీసులు వాహనంపై ఎగబడి భోజనం ప్యాకెట్లు లాక్కునే పరిస్థితి తలెత్తింది. సభా ప్రాంగణంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, ఇతర పార్టీ నేతల ఫోటోలు పెట్టి వచ్చిన జనంతో ఈ ఫోటోలను చేతులతో కొట్టించేలా ఏర్పాట్లు చేశారు.

సీఎం జగన్​కు నిరసన సెగ - రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.