People Facing Problems with Damaged Roads in Karakatta : కృష్ణానది పశ్చిమ కరకట్ట రోడ్డు ప్రాణాంతకంగా మారింది. 15 సంవత్సరాల క్రితం ఈ కరకట్టపై విజయవాడ నుంచి కొల్లూరు మండలం దోనే పూడి వరకు సుమారు 47 కిలోమీటర్ల మేర నదీ పరిరక్షణ శాఖ తారురోడ్డు నిర్మించింది. దీంతో కొల్లూరు నుంచి విజయవాడ వెళ్లేందుకు దూరం 20 కిలోమీటర్లు తగ్గింది. ఈ రహదారి గుండా ఆర్టీసీ బస్సులను కూడా నడుపుతోంది. ఎనిమిదేళ్ల క్రితం దీన్ని డబుల్ రోడ్డుగా విస్తరించారు. అయితే కొల్లూరు నుంచి ఈపూరు మధ్య కరకట్ట విస్తరణ జరగలేదు.
అడుగుకో గొయ్యి - గజానికో గుంతో అధ్వానంగా రాష్ట్ర రహదారులు - Road conditions in Krishna district
Villagers Demand for Karakatta Road Expansion : రహదారి విస్తరణకు భూసేకరణ అవసరం కాగా ఒక రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో అక్కడ కిలోమీటర్ మేర విస్తరణ జరగలేదు. న్యాయస్థానంలో ఈ వివాదం కొనసాగుతోంది. నిత్యం ఈ రహదారి వెంట ఇసుక రవాణా చేసే వాహనాలతో పాటు వివిధ భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో అంచులు దెబ్బతిని క్రమంగా ప్రయాణానికి వీలు లేని విధంగా తయారయ్యింది. దీంతో ఈ కొద్ది దూరం ప్రయాణించేందుకు వాహనదారులు హడలి పోతున్నారు. కిలోమీటర్ ప్రయాణానికి 15 నిమిషాలు సమయం పడుతుంది. ఎదురుగా వచ్చిన వాహనాలు తప్పుకోవాలంటే ప్రాణ సంకటంగా మారింది. ఏమాత్రం ఆదమరిచినా తూర్పు వైపున 20 అడుగులకు పైగా లోతు ఉన్న పొలాల్లో లేదంటే పడమర వైపు ఉన్న కృష్ణా పశ్చిమ బ్రాంచి కాలువలోకి పడిపోయే ప్రమాదం ఉంది. కనీసం మరమ్మతులైనా చేపడితే చాలా వరకు ఇబ్బందులు తప్పుతాయని వాహనదారులు, స్థానికులు మొరపెట్టుకుంటున్నా ప్రయోజనం లేదు.
'రహదారి విస్తరించిన ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల గోతులు పడ్డాయి. నదీపరిరక్షణ విభాగం వారు మరమ్మత్తు పనులు చేపట్టాల్సి ఉంటుంది. అవి కూడా చేయకపోవటంతో ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కరకట్ట మార్గాన్ని కొల్లూరు నుంచి విజయవాడ వెళ్లే వారు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మామూలుగా అయితే వేమూరు, తెనాలి మీదుగా వెళ్తే దూరం పెరుగుతుంది. అందుకే ఈ మార్గాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే ఈ ప్రాంతంలో రైతులు తమ పొలాలకు రాకపోకలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లటానికి ఇదే ప్రధాన రహదారి. పంట ఉత్పత్తులు తీసుకెళ్లటానికి కూడా రోడ్డుని వినియోగిస్తుంటారు. ఇసుక లారీలు ఎక్కువగా తిరగటంతో రహదారి కొన్నిచోట్ల పాడైపోయింది. ఈ రోడ్డు బాగు చేయాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదు.' - స్థానికులు
Public Face Problems With Roads Damage Krishna District : ఈ రహదారిలో జరుగిన ప్రమాదాల వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. కనీసం గుంతల్లో మట్టిపోయటం గానీ, రహదారి అంచులు పాడైన చోట మరమ్మత్తులు చేయటం లేదు. న్యాయపరమైన అడ్డంకులను సాకుగా చూపి యంత్రాంగం కాలం గడుపుతోంది. రోడ్డు విస్తరణకు ఇబ్బందులు ఉంటాయి గానీ మరమ్మత్తులకు ఎలాంటి సమస్య ఉండదు. కానీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోవటం వల్ల రహదారిలో ప్రయాణించేవారు నిత్యం రోధించాల్సి వస్తోంది.