ETV Bharat / state

ఇంటి నిర్మాణంలో హంగులే ముఖ్యం బిగులూ! - ఎన్ని కోట్లైనా తగ్గేదే లే! - HOUSE CONSTRUCTION COST IN TG

రూ.కోట్లు ఖర్చు చేసి ఇంటి నిర్మాణం చేసుకుంటున్న సామాన్యులు - చిరకాల వాంఛ తీర్చుకునేందుకు డబ్బుకు వెనకాడకుండా ఖర్చు - అధునాతన వసతులు, విద్యుత్​ కాంతులతో ఇల్లు ముస్తాబు

People Spend More Money to Build A House
People Spend More Money to Build A House (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2024, 6:44 PM IST

Updated : Oct 20, 2024, 7:02 PM IST

People Spend More Money to Build A House : ఈ మధ్య కాలంలో ఇంటి నిర్మాణంలో పేద, మధ్య తరగతి, ధనిక అనే భేదాలు లేకుండా, ప్రతి ఒక్కరూ తమ అభిరుచులకు తగ్గట్లుగా ఎంత ఖర్చు అయినా హంగులకు మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇళ్లు కట్టే బిల్డర్​కు ఎంత ఖర్చైనా తగ్గవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. తాము ఉండబోయే ఇంట్లో అన్ని హంగులూ ఉండేలా, చిరకాల వాంఛను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతి ఇంటి నిర్మాణంలో రాయల్​ పెయింట్స్​, ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్​తో రూఫ్​ల నిర్మాణం, వాల్స్​కు రంగురంగుల బొమ్మలు, విద్యుత్​ కాంతులు ఇలా వారికి నచ్చినట్లు ఇంటిని నిర్మించుకొని తమ కలను పూర్తి చేసుకుంటున్నారు.

HOUSE CONSTRUCTION COST IN TG
జిగేల్​మనిపించే గది అలంకరణ (ETV Bharat)

ఈ రోజుల్లో ఇళ్లు కట్టడమనేది ఒక మహా యుద్ధమనే చెప్పవచ్చు. అందుకే పెద్దలు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసి చూడు అన్నారు. ఇల్లు కట్టాలంటే ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత రోజుల్లో ఇల్లు కట్టడమే కాదు, అందులో అన్ని హంగులూ ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న పట్టణాల్లో సైతం హంగులతో కూడిన సొంతింటికే జనాలు మొగ్గు చూపుతున్నారు. ఖర్చుకు ఏమాత్రం తగ్గేదేలే అంటున్నారు. తమ అవసరాలు, అభిరుచుల మేరకు అధునాతన వసతులు, భవనాలను అద్భుతమైన రీతుల్లో నిర్మించుకుంటున్నారు.

HOUSE CONSTRUCTION COST IN TG
చేతితో తాకే అద్దంలో వెలుగుతున్న విద్యుద్దీపాలు (ETV Bharat)

ఓపెన్​ కిచెన్​కు ప్రాధాన్యం : రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో హైదరాబాద్​, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా గృహాలంకరణ నిపుణులను పిలిపించుకొని మరీ పనులు అప్పగిస్తున్నారు. గదుల్లో అలంకరణ, పూజ గదులు, పడక గదులు ఇలా దేనికదే ప్రత్యేకం అన్నట్లు సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఓపెన్​ కిచెన్​కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటి ఆకర్షణీయ హంగుల కోసం ఖర్చుకు మాత్రం వెనుకడుగు వేయడం లేదు.

HOUSE CONSTRUCTION COST IN TG
పడక గదిలో డెకరేషన్ (ETV Bharat)

మహబూబ్​నగర్​లో రూ.కోట్లు ఖర్చు చేసి ఇంటి నిర్మాణాలు : తాజాగా ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని పట్టణాల్లో రహదారులు, తదితర సౌకర్యాలు రూపుదిద్దుకుంటున్నాయి. దీంతో అక్కడి వాసులు రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మాణాలు చేసుకుంటున్నారు. పోలీస్ ఉద్యోగి 235 గజాల స్థలంలో రూ.1.60 కోట్లతో ఇంటిని తన అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించుకున్నాడు. ఎంతలా అంటే ఆ ఇంట్లో వేసిన బొమ్మకు ఏకంగా రూ.42 వేలు ఖర్చు చేశాడంటే ఖర్చు ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లోని అంతర్గత నిర్మాణం కోసం రూ.16 లక్షలు ఖర్చు చేశాడంట. మరోవైపు ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయురాలు 185 గజాల స్థలంలో రూ.1.40 కోట్లతో అద్భుతమైన ఇంటిని నిర్మించుకున్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.

మీ మెయిన్ డోర్​కు ఎదురుగా లిఫ్ట్ ఉందా? - వాస్తు ప్రకారం జరిగేది ఇదే! - Vastu Tips for Home in Telugu

అసలేంటి ఈ ఫ్యాబ్రికేటెడ్​ ఇళ్లు? - నెలలోనే ఇంటి నిర్మాణం పూర్తి! - Mobile Houses Trending in Hyderabad

Last Updated : Oct 20, 2024, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.