ETV Bharat / state

అధికారం వాడుకుని హంతకులు తప్పించుకోవడానికి వీల్లేదు: పీసీసీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల - PCC President Sharmila Campaign - PCC PRESIDENT SHARMILA CAMPAIGN

PCC President Sharmila Election Campaign in Proddatur YSR District : ఎన్నికలు సమీపిస్తున్న వేళ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రచారంలో జోరును పెంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్​ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రోడ్​ షోను నిర్వహించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచముల్లు, కడప ఎంపీ అవినాష్​ రెడ్డి, సీఎం జగన్​పై ఘటైన విమర్శలు చేశారు. అధికారం వాడుకుని హంతకులు తప్పించుకోవడానికి వీల్లేదు అంటూ మండిపడ్డారు.

sharmila_campaign
sharmila_campaign (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 11:23 AM IST

అధికారం వాడుకుని హంతకులు తప్పించుకోవడానికి వీల్లేదు: పీసీసీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల (Etv Bharat)

PCC President Sharmila Election Campaign in Proddatur YSR District : కడప రాజకీయాలు దేశం అంతా చూస్తుందని సొంత చిన్నాన్న వివేకా హత్య నిందితుడికి మళ్లీ పట్టం కడతారా? అని పీసీసీ అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్​ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వివేకా బిడ్డ ఈనాటికీ న్యాయం కోసం పోరాటం చేస్తున్నా సీఎం హోదా లో ఉన్న వ్యక్తి హంతకుడిని కాపాడుతున్నారంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మళ్లీ మళ్లీ ఇలాంటి నేరస్థులను చట్ట సభల్లోకి పంపుదమా? అని ప్రజలను ప్రశ్నించారు.

YS Sharmila Comment on Rachamallu : జూదం, గుట్కా, క్రికెట్ బెట్టింగ్, దొంగనోట్ల వ్యాపారం, భూ కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి అక్రమార్జనలో ఘనుడు అని షర్మిల విమర్శించారు. రూ. వేల కోట్ల అక్రమ సంపాదనకు ఆయన పడగలెత్తినట్లు ఆరోపించారు. ప్రొద్దుటూరు పురవీధుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్డు షోలో ఆమె పాల్గొన్నారు. ఎమ్మెల్యే అరాచకాలను ప్రశ్నిస్తే హత్యలను కూడా చేయిస్తారని ధ్వజమెత్తారు. రాజకీయంగా అడ్డుతగులుతున్న టీడీపీ నేత నందం సుబ్బయ్యను నరికి చంపినట్లు ఆరోపించారు.

న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటం - కడపలో గెలిచేది నేనే: షర్మిల - YS Sharmila Interview

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఈ ఎన్నికల్లో ఓటుకు రూ.3 వేలు ఇస్తే తీసుకోవాలని, ఆ డబ్బు ప్రజలదే అని వైఎస్​ షర్మిల స్పష్టం చేశారు. అన్యాయం, అక్రమాలకు పాల్పడుతున్న ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. చిన్నాన్న వివేకానందరెడ్డిని గొడ్డలితో ఏడుసార్లు కిరాతకంగా చంపిన కేసులో గత ఐదేళ్లకు పైగా నిందితులకు శిక్షపడకుండా సీఎం జగన్​ రెడ్డి అన్నివిధాలుగా కాపాడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

అవినాష్‌ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడం తెలియదు: షర్మిల - YS Sharmila Comments On Jagan

అప్పట్లోనే చిన్నాన్న కోరిక మేరకు ఎంపీగా పోటీ చేసి ఉంటే గొడ్డలి పోటుతో ఈ విధంగా దారుణ హత్య జరిగేది కాదని షర్మిల పేర్కొన్నారు. వివేక హత్య కేసులో సాక్ష్యాధారాలతో సీబీఐ విచారణలో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఛార్జిషీట్లో పేర్కొన్నా జగన్ మళ్లీ ఆయనకే టికెట్ ఇవ్వడంతోనే స్వయంగా ఎన్నికల బరిలోకి దిగినట్లు చెప్పారు. చిన్నాన్న కలను నెరవేర్చడానికి తాను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వివరించారు. తండ్రిని పోగోట్టు కున్న సునీత అందుకు బాధ్యులైన వారికి శిక్షపడాలని పట్టు విడకుండా సాహసోపేతంగా పోరాటం చేస్తున్నట్లు వివరించారు. శాసనసభ అభ్యర్థి పీఎండీ నజీర్ గెలుపు కోసం హస్తం గుర్తుకు ఓట్లు వేయాలని పార్టీ గుర్తును ఈ సందర్భంగా ఆమె ప్రదర్శించారు.

చేసిన అభివృద్ది హత్య రాజకీయాలే! జగన్ ప్రజల నెత్తిన టోపీ పెట్టి- చేతికి చిప్ప ఇచ్చారు: షర్మిల - YS Sharmila Criticizes Jagan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.