ETV Bharat / state

పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేస్తాం- ఉగాది వేడుకల్లో పవన్ - Pawan Kalyan Ugadi Celebrations - PAWAN KALYAN UGADI CELEBRATIONS

Pawan Kalyan Ugadi Celebrations in Pithapuram: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Pawan Kalyan Ugadi Celebrations in Pithapuram

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 12:44 PM IST

Pawan Kalyan Ugadi Celebrations in Pithapuram: రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది వేడుకలు కనులపండువగా సాగుతున్నాయి. ఉగాది పండగను పురస్కరించుకొని భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఆయా రాజకీయ పార్టీలు, ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించాయి. తెలుగుదేశం, బీజేపీ కాంగ్రెస్, వైసీపీ పార్టీలకు చెందిన నేతలు తమతమ పార్టీ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి ఉగాది వేడుకలను కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో జరుపుకొన్నారు. అక్కడ నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు.

పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో మంగళవారం ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. పిఠాపురం (Pithapuram) అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేస్తున్న పవన్‌కల్యాణ్‌, గొల్లప్రోలు బైపాస్‌లో నూతన భవనంలో నివాసం ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడే పూజలు నిర్వహించి, ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. పవన్ కల్యాణ్ నివాసం భవనంలోని కింది అంతస్తును సమావేశ మందిరంగా మార్చి పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు గొల్లప్రోలు చేరుకున్న పవన్, ఉగాది వేడుకల అనంతరం పార్టీ కీలక నాయకులతో పవన్‌ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం సాయంత్రం పవన్ కల్యాణ్ తిరిగి హైదరాబాద్‌ వెళ్లనున్నారు. 10, 11 తేదీల్లో మళ్లీ ఉమ్మడి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
హత్యారాజకీయాలు ప్రోత్సహిస్తున్న సీఎం జగన్​ను ప్రజలు ఇంటికిపంపాలి: షర్మిల - ys sharmila election campaign

పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేస్తాం- ఉగాది వేడుకల్లో పవన్

ఈ సారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: క్రోది నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నట్లు ప్రకటించారు. పంచాంగ పఠనాన్ని విన్న అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలని ఆకాంక్షించారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు రావాలని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. క్రోధి నామ సంవత్సరంలో రైతులకు మేలు జరగాలని ఆశించారు. ప్రజలంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నాయకుడు వర్మతోపాటు, జనసేన నేతలు పాల్గొన్నారు.

టికెట్ దక్కని నేతలకు చంద్రబాబు బుజ్జగింపు - అధికారంలోకి వచ్చాక పదవులు ఇస్తానని హామీ - Chandrababu met candidates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.