ETV Bharat / state

వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోండి - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పిలుపు - Pawan Kalyan on Vinayaka Chavithi - PAWAN KALYAN ON VINAYAKA CHAVITHI

Pawan Kalyan on Vinayaka Chavithi: రాష్ట్ర ప్రజలు పర్యావరణహితంగా వినాయకచవితి జరుపుకోవాలని డిప్యూటి సీఎం పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. మట్టి వినాయకుని ప్రతిమలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పిఠాపురంలో మట్టివినాయకుని విగ్రహాలకు పూజలు జరిగేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలో పిఠాపురంలోని అన్ని ఆలయాల్లో ఈ ప్రయోగత్మాక విధానం అమలు చేస్తామన్నారు.

pawan_kalyan_on_vinayaka_chavithi
pawan_kalyan_on_vinayaka_chavithi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 7:28 PM IST

Pawan Kalyan Call to Celebrate Vinayaka Chavithi in Environment Free Manner: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) చేపట్టిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలపై వరుసగా సమీక్షలు చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలు అందిస్తూ దానికి తగినట్లుగా ఆదేశాలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి పలు సూచనలు, అభిప్రాయాలూ పవన్​కి అందుతున్నాయి. తమ అభిప్రాయాలను తెలియచేస్తూ నివేదికలు పంపిస్తున్నారు. ఈ క్రమంలో మంగళగిరిలో పవన్ కల్యాణ్ నివాసంలో కొంత మంది ప్రకృతి ప్రేమికులు ఆయనను కలిసారు. ఈ క్రమంలో పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వాడకం పెంచి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు తగిన సూచనలు చేశారు.

పీసీబీ అధికారులతో పవన్ సమీక్ష - వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్​కు నోటీసులు జారీ చేయాలని ఆదేశం - Pawan orders on Veerabhadra Exports

పర్యావరణహితంగా జరుపుకోవాలని పవన్ పిలుపు: పర్యావరణ హితంగా వినాయక చవితి చేసుకోవాలని ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వినాయక చవితిని మట్టి వినాయకులే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పిఠాపురంలో మట్టి వినాయకుని విగ్రహాలతో పూజలు జరిపేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించాలన్నారు. మన వేడుకలు ఉత్సవాల్లో పర్యావరణహిత వస్తువులను వాడడం మేలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

వినాయక చవితి వేడుకల్లోనూ మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనమని స్పష్టం చేశారు. దేవాలయాల్లో ప్రసాదాన్ని బటర్ పేపరుతో చేసిన కవర్లతో ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రసాదాలను ప్లాస్టిర్ కవర్లల్లో కాకుండా తాటాకు బుట్టలు, ఆకుల దొన్నెలతో వాడాలని సూచించారు. ఈ తరహా వినియోగాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.

వేడుకలు, ఉత్సవాల్లో పర్యావరణహితమైన వస్తువులను వాడితే మేలు కలుగుతుంది. ఈ వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుంది. జల కాలుష్యాన్ని అరికట్టవచ్చు. మట్టి గణపతికి పూజలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాము.- పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం

తీర కోతకు 'రక్షణగోడ' పరిష్కారమన్న డిప్యూటీ సీఎం- పవన్‌ వ్యాఖ్యలపై మత్స్యకారుల్లో ఆశలు - Uppada Coastal Area

అసెంబ్లీ గేటు కూడా తాకలేవంటే పిఠాపురం ప్రజలు డిప్యూటీ సీఎంను చేశారు: పవన్‌ కల్యాణ్ - Pawan Kalyan Varahi Sabha

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.