ETV Bharat / state

ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ - తైక్వాండోలో రాణిస్తున్న విజయవాడ అమ్మాయి - Taekwondo pavani sai - TAEKWONDO PAVANI SAI

Pavani Sai Excelling in Taekwondo in Vijayawada : తండ్రి ప్రోత్సాహంతో తైక్వాండోలో సత్తా చాటుతుంది విజయవాడకు చెందిన పావని సాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనలు ఇస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే తన లక్ష్యమని పేర్కొంటుంది.

pavani_sai_vijayawada
pavani_sai_vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 10:18 AM IST

తండ్రి ప్రోత్సాహంతో తైక్వాండోపై ఆసక్తి - అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యమంటున్న పావని సాయి (ETV Bharat)

Pavani Sai Excelling in Taekwondo in Vijayawada : యుద్ధ కళల్లో తైక్వాండోది ప్రత్యేక స్థానం. అలాంటి విద్యలో అదరగొడుతోందా అమ్మాయి. ఆర్థిక పరిస్థితులు అడ్డువచ్చినా అయినా వాళ్లను కోల్పోయినా అధైర్య పడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. చదువుల్లో రాణిస్తూనే ఎంచుకున్నక్రీడలో పతకాలూ సాధిస్తోంది. పేదరికం ప్రతిభకు అడ్డు కాదని చాటుతూ ప్రశంసలు అందుకుంటోంది తెలుగమ్మాయి పావని సాయి.

తండ్రి ప్రోత్సాహంతో : తైక్వాండో ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం కల్పించే యుద్ధవిద్య. ఈ ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తోంది ఈ అమ్మాయి. చిన్నవయసులో నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతో కెరీర్‌ మెుదలు పెట్టింది. ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెట్టినా ధైర్యంగా ముందుకు సాగింది. క్రమం తప్పకుండా సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తోంది ఈ యువ క్రీడాకారిణి. ఈ అమ్మాయి పేరు సంపతి పావని సాయి.

విజయవాడ మేరీస్‌ స్టెల్లా కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో తైక్వాండోపై మక్కువ పెంచుకుంది. అలా చిన్ననాడే క్రీడల వైపు అడుగులేసి మెళకువలు నేర్చుకుంది. కానీ, అనారోగ్యంతో తండ్రి మరణించడంతో కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు మెుదలయ్యాయి. దాంతో కొన్నాళ్లు ఆటలకు దూరంగా ఉన్నానని చెబుతోంది.

హాబీతో ప్రత్యేకత చాటుకున్న యువకుడు - నాణేల సేకరణతో అంతర్జాతీయ రికార్డులు - RAVITEJA COINS COLLECTIN

"మా నాన్న ప్రోత్సాహంతోనే రెండో తరగతి నుంచి తైక్వాండోను నేర్చుకుంటున్నాను. కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంత కాలం వరకు తైక్వాండోకు దూరంగా ఉన్నాను. మా అమ్మ, కోచ్​ సహాయంతో మళ్లీ తైక్వాండో ప్రాక్టీస్​ చేస్తున్నాను. నేషనల్​ చాంపియన్​షిప్​ పోటీల్లో కాంస్యం, రజత పతకాలు సాధించాను. అంతర్జాతీయ తైక్వాండో పోటిల్లో పాల్గొనాలని సాధన చేస్తున్నాను"_పావని సాయి, తైక్వాండో క్రీడాకారిణి

జాతీయ పోటీలకు అర్హత : పావని తల్లి అపర్ణ విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి ప్రోత్సాహంతో సాధన చేసి రాష్ట్రస్థాయి అండర్-11 బాలికల విభాగంలో కాంస్యం సాధించింది పావని. 2019లో విశాఖ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పూమ్‌సే విభాగంలో పసిడి పతకం కైవసం చేసుకుంది. అనంతరం జాతీయ పోటీలకు అర్హత పొందినా ఆర్ధిక ఇబ్బందులతో వెళ్లలేకపోయింది ఈ క్రీడాకారిణి. ఆటపై ఇష్టంతో గతేడాది తిరిగి సాధన ప్రారంభించింది పావని.

రాష్ట్రస్థాయి అండర్-19 పోటీల్లో పాల్గొని రజతం సాధించింది. అలాగే పూమ్‌సే వ్యక్తిగత విభాగం, టీమ్ విభాగాల్లో పసిడి పతకాలు సొంతం చేసుకుంది. అదే పట్టుదలతో ప్రయత్నించి జాతీయ చాంపియన్‌షిప్‌ పోటీల్లో కాంస్యం, రజత పతకాలు కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జాతీయ తైక్వాండో రిఫరీ పరీక్షలో 'బెస్ట్ ఫిమేల్ రిఫరీ'గా ఉత్తీర్ణురాలైంది పావని.

కూచిపూడిలో గిరిజన బిడ్డల ప్రతిభ- దేశ విదేశాల్లో అద్భుత ప్రదర్శనలు - Kuchipudi in Srikakulam district

అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యం : పావని క్రీడ ప్రయాణం అనుకున్నంత సులువుగా సాగడం లేదు. తండ్రి లేకపోవడం, ఆర్థికంగా పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పలు ఓటముల తర్వాత శిక్షకుల సూచనలతో తనలోని లోపాలను సవరించుకుంది. రోజుకు నాలుగైదు గంటలు సాధన చేస్తూ ఆటపై పట్టు సంపాదించింది. అలా జాతీయ స్థాయి వరకు ఎదిగింది.

అటు చదవులోనూ మంచి మార్కులు సాధించింది ఈ అమ్మాయి. వివిధ రాష్ట్రాల పోటీలకు వెళ్లడానికి తల్లి, శిక్షకుల సాయంతో అతికష్టంపై ముందుకు సాగుతోంది పావని. కష్టాలను అధిగమిస్తూ ఈ అమ్మాయి సాధిస్తున్న విజయాల పట్ల కోచ్ గౌరీశంకర్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిరంతర కృషి, ఆత్మవిశ్వాసం ఆమెను ఉన్నత స్థానంలో నిలుపుతోందని చెబుతున్నారు. భవిష్యత్తులో పావని అంతర్జాతీయ పోటీలకు వెళ్లడం ఖాయమని అంటున్నారు.

మెుదట డ్యాన్సర్‌ కావాలని భావించింది పావని. కానీ, తండ్రి కోరిక మేరకు తైక్వాండోలో రంగప్రవేశం చేసి సత్తా చాటుతోంది. ఇదే ఆత్మవిశ్వాసం, పట్టుదలతో సాధన చేసి దేశానికి ప్రాతినిథ్యం వహిస్తానని ధీమాగా చెబుతోంది. నావెల్ మర్చంట్‌లో ఓడ చోదకురాలిగా స్థిరపడడం లక్ష్యం అంటోంది ఈ యువ క్రీడాకారిణి.

ఒలంపిక్స్​లో పసిడి పతకమే లక్ష్యం - పవర్‌లిఫ్టింగ్‌లో ​గుంటూరు యువ క్రీడాకారుడు సత్తా - Power Lifter Bharat Kumar

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.