ETV Bharat / state

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 పోలింగ్‌ కేంద్రాల్లో మళ్లీ ఓట్ల లెక్కింపు! - EVMs Mock Polling in Ongole - EVMS MOCK POLLING IN ONGOLE

EVMs Mock Polling in Ongole : ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల మాక్​ పోలింగ్ చేపట్టనున్నారు. అక్కడి వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని తనకు ఈవీఎంలు, ఓటింగ్​ సరళిపై అనుమానాలు ఉన్నట్లు అభ్యంతరం తెలిపారు. ఇందుకుగాను ఆయన ఈవీఎంల మాక్​ పోలింగ్ నిర్వహణ జరపాలని ఎన్నికల సంఘానికి డబ్బులు చెల్లించారు. ఈ క్రమంలోనే అధికారులు ఇందుకోసం సన్నద్ధమవుతున్నారు.

EVMs Mock Polling in Ongole
EVMs Mock Polling in Ongole (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 1:24 PM IST

Mock Polling for Ongole Assembly Constituency : ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలోని 12 పోలింగ్‌ కేంద్రాలకు చెందిన ఈవీఎంల్లో మాక్‌ పోలింగ్‌ నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 26 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ విజయ ఢంకా మోగించారు. నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 34,060 ఓట్లతో ఆయన వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలుపొందారు.

Officers Preparations Mock Polling in Ongole Seat : వైఎస్సార్సీపీ సర్కార్​పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూటమిపై ఉన్న నమ్మకంతో దామచర్ల జనార్దన్​కు ప్రజలు పట్టం కట్టారు. దీనికితోడూ నగరంలో ఆయన అంతకుముందు చేపట్టిన అభివృద్ధి పనులు వెరసి ఈ ఆదరణ లభించినట్లైంది. అయితే ఓటింగ్‌ సరళి, ఈవీఎంలపై తనకు అనుమానాలున్నట్లు వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు.

మొత్తం 12 కేంద్రాల్లో : పన్నెండు పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంల మాక్‌ పోలింగ్‌ నిర్వహణ చేపట్టాలని బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆయన రూ.5.44 లక్షల నగదును ఎన్నికల సంఘానికి చెల్లించారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మే 13 నాటి ఎన్నికల్లో వినియోగించిన 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు.

ఇందుకోసం ఈ నెల 19 నుంచి 24వ తేదీ మధ్యలో ఈవీఎంల మాక్‌ పోలింగ్‌ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే తేదీ ఖరారు చేయనున్నారు. దీనిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అధికారులు సమాచారం అందించనున్నారు. మరోవైపు ఈ ప్రక్రియ నిర్వహణ కోసం బెల్‌ కంపెనీ ప్రతినిధులను కూడా వారు ఆహ్వానించనున్నారు.

ఆగస్టు 30న ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బొత్స - Visakha MLC Election

ఈవీఎం ఓట్ల లెక్కింపు అంత ఈజీ కాదు- కౌంటింగ్​ ఏజెంట్లు ఏం చేయాలంటే! - EVM VOTES COUNTING

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.