ETV Bharat / state

మహిళా భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి- డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం- విజయవాడ నూతన కమిషనర్​ - NTR POlice Commissioner On Security - NTR POLICE COMMISSIONER ON SECURITY

NTR District Police Commissioner On Security Issues : ఎన్టీఆర్​ జిల్లాలో పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలతో విధులు నిర్వహిస్తామని కమిషనర్​ రాజశేఖర్​బాబు స్పష్టం చేశారు. ఈ దిశగా వేగవంతమైన కార్యచరణతో యంత్రాంగం ముందడుగు వేస్తుందని వెల్లడించారు.

ntr_district_police_commissioner_on_security_issues
ntr_district_police_commissioner_on_security_issues (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 7:07 PM IST

NTR District Police Commissioner On Security Issues : ప్రజల్లో నమ్మకాన్ని భరోసా కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని విజయవాడ నూతన పోలీస్ కమిషనర్​ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు అన్నారు. నగరంలో ట్రాఫిక్​ సమస్య పరిష్కారంపై దృష్టి పెడతామని తెలిపారు. ఫిర్యాదుదారుల్లో నమ్మకం కలింగించేలా చర్యలు చేపడతామన్నారు. సిటిజన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చని తెలిపారు. గ్రీవెన్సెల్​ను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు పని తీరును మెరుగు పరుస్తామన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు అందరూ సహకరించాలని సీపీ కోరారు. ఉమెన్ మిస్సింగ్ కేసులను సాధ్యమైనంత త్వరలో పరిష్కారించే దిశగా ముందడుగు వేస్తామన్నారు.

గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డే అండ్​ నైట్ బీట్స్ మరింతగా పెంచుతామన్నారు. సైబర్ క్రైమ్స్ విషయంలో వినూత్న రీతిలో ముందుకు వెళ్తామన్నారు. 200 మంది సిబ్బందిని సైబర్ కమాండర్స్​గా నియమిస్తామన్నారు. రోడ్ సేఫ్టీ పై ప్రత్యేక దృష్టి పెడతామని, కమ్యూనిటీ పోలిసింగ్ అమలు చేస్తామని పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు తెలిపారు.

'ప్రజలంతా ఇప్పుడు టెక్నాలజీని అనుసంధానం చేసుకుని పోలీసుల సేవలను వినియోగించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. డయల్​ 100, 112, 1930 ద్వారా ఫిర్యాదు చెయ్యెచ్చు. అలాగే సిటిజన్​.ఏపీ పోలీస్​.జీవోవీ.ఇన్ నుంచి తమ సమస్యలు పోలీసులకు చేరవెయ్యచ్చు.​' - విజయవాడ నూతన నగర పోలీస్ కమిషనర్ ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు

Vijayawada New Police Commissioner : కొత్త ప్రభుత్వంలో ప్రజలు మరింత భద్రతా యుతమైన, స్నేహపూర్వమైన పోలీసు యంత్రాంగాన్ని చూస్తారని కమిషనర్​ తెలిపారు. ఈ సందర్బంగా రాజశేకర్​బాబు మాట్లాడుతూ ప్రజలకు పలు సూనలు ఇచ్చారు. ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామివార్లను విజయవాడ నూతన నగర పోలీస్ కమిషనర్ ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు దంపతులు దర్శించుకున్నారు. ఈవో కె.ఎస్ రామరావు కమిషనర్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వారికి ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాన్ని ఆలయ ఈవో అందజేశారు.

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేందుకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నా: ఏబీ వెంకటేశ్వరరావు - IPS AB Venkateswara Rao

కార్యాలయం లేదు, ఉద్యోగులూ లేరు- కమిషనర్​ రాజీనామాతో 12వ పీఆర్సీ కథ ముగిసింది! - jagan Cheating Govt Employeees

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.