ETV Bharat / state

హిందూపురం టీడీపీ అభ్యర్థిగా బాలయ్య నామినేషన్ - BALAKRISHNA NOMINIATION - BALAKRISHNA NOMINIATION

Nomination For AP Elections: రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తొలిరోజు 229 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజూ భారీగా నామినేషన్లు వేస్తున్నారు. హిందూపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. మూడో సారి బాలకృష్ణ విజయం ఖాయమని టీడీపీ నేతలంటున్నారు.

Nomination_For_AP_Elections
Nomination_For_AP_Elections
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 1:16 PM IST

Nomination For AP Elections: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో జరుగనున్న ఏపీ శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరుగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏప్రిల్ 25 తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేసేందుకు తుది గడువుగా ఈసీ ప్రకటించింది. 26వ తేదీన నామినేషన్లు పరిశీలన చేయనున్నారు. అలాగే 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా పేర్కొన్నారు.

హిందూపురం టీడీపీ అభ్యర్థిగా బాలయ్య నామినేషన్

ఏపీలో రేపటి నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ - Nomination Process For AP Elections

హిందూపురం అభ్యర్థి బాలకృష్ణ నామినేషన్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానానికి ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర దేవితో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. నామినేషన్​ వేయడానికి ముందు ఉదయం హిందూపురంలోని సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో బాలకృష్ణ పూజలు నిర్వహించారు.

Balakrishna Election Campaign: హ్యాట్రిక్ విజయాల దిశగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అడుగులు వేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే పార్టీల కతీతంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన బాలకృష్ణ ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలను సైతం కొనసాగిస్తున్నారన్నారు. ఈనెల 12 నుంచి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో రాయలసీమ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరి నుంచి స్వర్ణాంధ్ర సాకార యాత్ర ప్రారంభమైందని తెలిపారు. రాయలసీమ పర్యటన అనంతరం ఉత్తరాంధ్రలో బాలకృష్ణ ప్రచారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది.

ఎన్నికల ప్రచారంలోకి ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర- సత్యసాయి జిల్లాలో పర్యటన - Vasundhara at election campaign

చంద్రబాబు తరపున నామినేషన్ వేయనున్న భువనేశ్వరి: ఈరోజు మధ్యాహ్నం కుప్పం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున తొలిసారిగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు కుప్పం వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్థానిక ప్రజలతో కలిసి భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కుప్పంలో చంద్రబాబు తరఫున భువనేశ్వరి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

నేడు నారా లోకేశ్ - రేపు చంద్రబాబు నామినేషన్ దాఖలు - Chandrababu Nomination in kuppam

తొలిరోజు దాఖలైన నామినేషన్లు: రాష్ట్రంలో తొలిరోజు 229 నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్​సభ స్థానాలకు 39 నామినేషన్లు, శాసనసభ స్థానాలకు 190 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్సీపీ, ఎన్డీఏ, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు వేశారు. ఈరోజు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.