AP POLICE FAILED TO CHAZED STONE CASE : గులకరాయి ఘటన జరిగి 9 రోజులైనా కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఆధారాల సేకరణలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 8 బృందాలతో కూడిన ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినా సమాచారం ఇచ్చిన వారికి 2 లక్షల రివార్డు ప్రకటించినా ఫలితం కనిపించడం లేదు. తెలుగుదేశం నాయకుడు దుర్గారావును 4 రోజులపాటు అదుపులో ఉంచుకుని పోలీసులు ప్రశ్నించినా కేసును ముందుకు తీసుకెళ్లే ఆధారాలు మాత్రం లభ్యం కాలేదు. ఇప్పటివరకు ఏ1 సంగతి మాత్రమే పోలీసులు తేల్చారు. మరి మిగిలిన నిందితులు ఎవరు? వారి పాత్ర ఏంటి? అన్నది ఇంతవరకు తేల్చలేకపోయారు.
గలకరాయి దాడి కేసులో కీలక విషయాలు వెల్లడించిన దుర్గారావు - Stone Attack Accused Durga Rao
Stone Case Updateas : సీఎం జగన్‌పై గులకరాయి విసిరిన కేసులో తొలుత అదుపులోకి తీసుకున్న ఐదుగురిలో సతీష్‌ను నిందితుడిగా పోలీసులు తేల్చి కోర్టులో హాజరుపర్చారు. రిమాండ్ రిపోర్టులో ఏ2 ప్రోద్బలంతోనే ఏ1 అయిన సతీష్ జగన్‌పై రాయి విసిరాడని పేర్కొన్నారు. సతీష్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. సతీష్‌ను, దుర్గారావును వేర్వేరుగా ప్రశ్నించి, ఆ తర్వాత ఇద్దరినీ కలిపి విచారించినా పోలీసులకు ఎలాంటి ఆధారం దొరకలేదు. కేవలం సాక్షుల స్టేట్‌మెంట్ల ఆధారంగానే పోలీసులు ఈ కేసును నడిపిస్తున్నారే తప్ప సాక్ష్యాల సేకరణలో మాత్రం పురోగతి లోపించింది. మరోవైపు అప్పటికే నాలుగురోజులు కస్టడీలో ఉంచుకోవడం అతని కుటుంబీకులు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు సన్నద్ధమవుతుండడం వల్ల దుర్గారావును విడిచిపెట్టాల్సిన పరిస్థితి తలెత్తినట్లు భావిస్తున్నారు.
సీఎం జగన్‌పై రాయి దాడి కేసు - అనేక నాటకీయ పరిణామాల మధ్య దుర్గారావు విడుదల - Durga Rao Release
Stone Attack on CM Jagan : గులకరాయి కేసులో ఏ2 గా దుర్గారావును చేరుస్తున్నట్లు పోలీసులు లీకులిచ్చి చివరకు ఆధారాలు దొరక్క వదిలేశారు. మరి ఈ కేసులో ఏ2 ఎవరిని చేరుస్తారు? వారి పాత్రను ఎలా నిర్ధారిస్తారు? అన్నది తేలాల్సి ఉంది. దానితోపాటు అసలు పోలీసులు ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్తారు? తాము లక్ష్యంగా చేసుకున్న వారికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించగలరా? అనేది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఘటన జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడం ప్రధాన కారణం. దీనికి తోడు కీలక ఆధారాల సేకరణలో పోలీసుల వైఫల్యం కేసు పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారింది.
Satish Arrest in Stone Attack : పోలీసులు తనను విడిచిపెట్టే సమయంలో ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నట్లు దుర్గారావు చెప్పారు. CRPC నోటీసు ఇచ్చి ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని ఆదేశించినట్లు తెలిపారు. దీని వల్ల అతడిని ఎప్పుడైనా విచారణకు పిలిచి అరెస్టు చూపించే అవకాశాలు లేకపోలేదు. ఈ ఘటనలో టీడీపీ నేతల పాత్రపై పోలీసులు నిశితంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రయత్నంలో ఎవరో ఒకరిని ఇరికించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తానే జగన్‌పైకి రాయి విసిరానని ఒప్పుకున్న సతీష్ స్టేట్‌మెంట్‌ను ఇవాళ మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు నమోదు చేయించనున్నారు. అయితే వారి అదుపులో ఉన్న సమయంలో ఇచ్చిన నేర అంగీకారపత్రంలో చెప్పినదానికి భిన్నంగా తనను బెదిరించి ఒప్పించారని చెబితే పోలీసులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
విజయవాడ పోలీస్ 'గులకరాయి దాడి స్టోరీ'- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అదుర్స్! - CM Jagan attack case