ETV Bharat / state

విజయవాడలో మృత్యుఘోష - డయేరియా లక్షణాలతో మరణాలు - 9 diarrhoeal deaths In Vijayawada - 9 DIARRHOEAL DEATHS IN VIJAYAWADA

Nine Members Died Due to Diarrhea in Vijayawada: విజయవాడలో అతిసారం ఆందోళన కలిగిస్తోంది. కలుషిత జలాల కాటుకు 5 రోజుల వ్యవధిలోనే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మొగల్రాజపురంలో వాంతులు, విరేచనాలతో నేడు గల్లా కోటేశ్వరరావు(60) మృతి చెందారు. వందల మంది ఆస్పత్రుల పాలయ్యారు. నగరంలో డయేరియా వేగంగా విస్తరిస్తున్నా అడ్డుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో కనీసం వైద్య శిబిరాలూ నిర్వహించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

Nine Members Died Due to Diarrhea in Vijayawada
Nine Members Died Due to Diarrhea in Vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 1, 2024, 8:51 AM IST

Updated : Jun 1, 2024, 8:59 AM IST

డయేరియా లక్షణాలతో రాలిపోతున్న విజయవాడ వాసులు - నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు (ETV Bharat)

Nine Members Died Due to Diarrhea in Vijayawada : ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు మంచాన పడ్డారు. ఇంటికొకరు ఆస్పత్రి పాలయ్యారు. ఏ ఇంట్లో చూసినా మూడు నాలుగు రోజులుగా విరోచనాలతో బాధపడే వారే కనపడుతున్నారు. ఇదీ విజయవాడని దుస్థితి. రోజువారీ కూలీలు, పేదలు, అసంఘటిత రంగ కార్మికులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో అతిసారం విజృంభిస్తున్నా అధికారులకు మాత్రం చీమకుట్టినట్లైనా అనిపించడం లేదు. కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో కనీసం వైద్య శిబిరాలూ నిర్వహించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. అతిసారం బారిన పడి ఇప్పటికే 9 మంది మృతి చెందినా వైద్యారోగ్య శాఖ మాత్రం మొద్దునిద్ర వీడటం లేదు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 250 మంది రక్తనమూనాలు సేకరించినట్లు అధికారులు చెబుతున్నా ఇంతవరకూ ఒక్కదాని ఫలితాన్నీ ప్రకటించలేదు. మృతుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించ లేదు. అతిసార వేగంగా విస్తరిస్తున్న వీఎమ్​సీ యంత్రాంగం కనీసం నియంత్రణ చర్యలు చేపట్టలేదని బాధితుల బంధువులు విమర్శిస్తున్నారు.

విజయవాడ నల్లాల్లో విషం- అతిసారంతో ఇంటికొకరు ఆస్పత్రిలో, నలుగురు మృత్యువాత - Water Contamination in Vijayawada

విజయవాడలోని మొగల్రాజపురంలో సరఫరా చేసిన నీటిలో నైట్రేట్లు మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. మొగల్రాజపురంలో వాంతులు, విరేచనాలతో గల్లా కోటేశ్వరరావు(60) మృతి చెందారు. ఇక్కడ నీటిని క్లోరినేషన్‌ చేసిన వెంటనే సరఫరా చేశారని, అలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బోర్లు వేసిన ప్రాంతాలు సైతం సురక్షితమైనవి కావని తేల్చారు. మరోవైపు నీటి నమూనాలను పరీక్షించాల్సిన ప్రాంతీయ, జిల్లా ప్రజారోగ్య ప్రయోగశాలలు, నీటి పరీక్షా కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయి. ఈ ప్రయోగశాలల్లో బోర్లు, చేతిపంపులు, బావులు, ఇతర చోట్ల సేకరించే నీటి నమూనాలను పరీక్షించి, లోపాలపై సంబంధిత విభాగాలను అప్రమత్తం చేయాలి. కానీ చాలాచోట్ల పరికరాలు పని చేయడం లేదు. పైప్‌లైన్లలో మురుగునీరు కలవడం వల్లే దుర్వాసనతో కూడిన నీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు వాంతులు, విరోచనాలతోనే మరణించినా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.

విజయవాడలో పెరుగుతున్న డయేరియా కేసులు - ఏడుకి చేరిన మృతులు సంఖ్య - DIARRHEA CASES

ఒకవైపు కళ్లముందే అతిసారం ప్రబలుతుంటే నీటి కాలుష్యం కాదంటూ వీఎంసీ కమిషనర్‌ కొట్టిపారేస్తున్నారు. ద్రవక్లోరిన్‌ కలపడం వల్ల నీరు పసుపు రంగులోకి మారిందని చెబుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింతగా విషమించకముందే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రామలింగేశ్వర్‌నగర్, కృష్ణలంక, రాణిగారితోట, క్రీస్తురాజపురం, సత్యనారాయణపురం, సీతారాంపురం, గుణదల, గంగిరెద్దులదిబ్బ, సింగ్‌నగర్‌ ప్రాంతాలకు కలుషిత నీటి ముప్పు పొంచి ఉందని పలువురు చెబుతున్నారు.

విజయవాడలో విజృంభిస్తున్న డయేరియా- ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య - Diarrhea Death Cases in Vijayawada

Last Updated : Jun 1, 2024, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.