ETV Bharat / state

'న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోండి - పరిమితులు దాటితే తప్పదు శిక్ష' - NEW YEAR 2025 RULES IN VIJAYAWADA

నూతన సంవత్సర వేడుకల వేళ విజయవాడలో ఆంక్షలు

New Year Celebrations 2025
New Year Celebrations 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2024, 7:16 AM IST

New Year 2025 Rules in Vijayawada : రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. కొత్త ఏడాదిని స్వాగతిస్తూ ఈ ఏడాదికి ఘనంగా ముగింపు పలికేందుకు ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే వేడుకల కోసం హోటళ్లు, రిసార్ట్​లు, పబ్​లు, క్లబ్బుల నిర్వహకులు, యాజమాన్యాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ఈ వేడుకల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పలు నిబంధనలు జారీ చేశారు.

ఈ క్రమంలోనే విజయవాడ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి రోడ్లపై రెచ్చిపోయి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ రాజశేఖర్​బాబు హెచ్చరించారు. హోటళ్లు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్దేశిత సమయం వరకే వేడుకలు జరుపుకోవాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ రాజశేఖర్​బాబు వివరించారు.

Vijayawada New Year Celebrations 2025 : డ్రోన్ కెమెరాల చిత్రీకరణతో పాటు ఎక్కువ మంది సిబ్బందితో, అన్నిచోట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని సీపీ రాజశేఖర్​బాబు తెలిపారు. ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆట కట్టిస్తామని అన్నారు. శ్రుతి మించితే వెంటనే చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతంగా వేడుకలను జరుపుకోవాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ ప్రజలు సహకరించాలని సీపీ రాజశేఖర్​బాబు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు 2024లో ఎదురైన అనేక సవాళ్లను పోలీసు శాఖ సమర్థంగా ఎదుర్కొందని సీపీ రాజశేఖర్​బాబు తెలిపారు. ఈ ఏడాదికి సంబంధించిన వార్షిక నేరాల నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం విజయవాడ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు గతేడాదితో పోలిస్తే 73.14 శాతం పెరిగినట్లు చెప్పారు. బాధితులు పోగొట్టుకున్న సొమ్ము మూడు రెట్లు పెరిగిందని వివరించారు. గత సంవత్సరం కంటే ఈసారి రోడ్డు ప్రమాదాలు 9.11 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో పోలీసు శాఖ బలోపేతం, నేరాల నియంత్రణకు మరింత కృషి చేస్తామని సీపీ రాజశేఖర్​బాబు వెల్లడించారు.

న్యూ ఇయర్‌ వేడుకలు - మెట్రో వేళలు పొడిగింపు, ఫ్లైఓవర్లు మూసివేత

హైదరాబాద్​లో న్యూఇయర్​ వేడుకలు - అద్దిరిపోయే ఈవెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.