New Ration Cards in Telangana : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల కుటుంబాలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను పొందడానికి తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో.. జనం దృష్టంతా కొత్త రేషన్ కార్డుల(Ration Cards) జారీపై పడింది. అలాంటి వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్ ఇచ్చారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా.. ఇప్పటికే కొన్ని పథకాలను అమలులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిశాక మరికొన్ని హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ఇచ్చిన హామీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
ఏం ప్రకటన చేశారంటే.. నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి మంత్రి పొన్నం చేసిన ఈ ప్రకటన శుభవార్తే అని చెప్పుకోవచ్చు. అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే.. సీఎం రేవంత్రెడ్డి కూడా కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
మీకు గ్యాస్ సబ్సిడీ రావట్లేదా? - ఇంకా కేవైసీ పూర్తి చేయలేదా? - ఇలా చేయండి!
భారీగా దరఖాస్తులు : రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు గానూ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. మరోవైపు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికే సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో రేషన్ కార్డు లేని వారంతా కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దాదాపు 20 లక్షల మంది కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
అయితే.. ఈ అప్లికేషన్స్ అన్నింటినీ మొదట స్క్రూటినీ చేసి.. ఆ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టబోతున్నారని సమాచారం. ఈ వెరిఫికేషన్లో అర్హులుగా తేలిన వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డ్స్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణలో ఈ ఫిల్టరింగ్ జరుగుతుందని సమాచారం. ఈ క్రమంలో.. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటనతో రేషన్ కార్డు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
రైతులకు గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే రైతుభరోసా స్కీమ్ అమలు - వారికి మాత్రమే రూ.15,000..!