NDSA Committee Meeting in Jalasoudha : ఎన్డీఎస్ఏ ప్రాథమిక నివేదిక ఆధారంగానే బ్యారేజీ మరమ్మతులతో పాటు, తప్పు చేసిన వారిపై చర్యలు చేపట్టనున్నట్లు నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమారెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరంలో ప్రాజెక్టులోని ఆనకట్టల అధ్యయనంపై జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ(NDSA) నియమించిన నిపుణుల కమిటీ ఇవాళ రాష్ట్రానికి చేరుకుంది. జలసౌధలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్, ఆ శాఖ కార్యదర్శి, ఈఎన్సీలు ఎన్డీఎస్ఏ కమిటీతో సమావేశమయ్యారు.
Minister Uttam NDSA Meeting : తాము కోరిన వెంటనే జలాశక్తి శాఖ కమిటీ వేసి పరిశీలనకు పంపినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam) తెలిపారు. ఎన్డీఎస్ఏ కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వివరించారు. మేడిగడ్డలో అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి వివరించారు. ఎన్డీఎస్ఏ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. నాలుగు నెలల కంటే ముందే ప్రాథమిక నివేదికను వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరారు.
మోదీ విధానాల కారణంగానే దేశంలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి పేరుకుపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్కు ఏటీఎంగా మారటానికి ప్రధాన కారణమే మోదీ ప్రభుత్వమని మంత్రి ఆరోపించారు. కేంద్ర సహకారంతోనే కార్పొరేషన్ల ద్వారా, అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 84 వేల కోట్ల రుణం తీసుకుందని ఆయన గుర్తు చేశారు. తమని విమర్శించే అర్హత బీజేపీకి లేదని పేర్కొన్నారు.
డ్రాయింగ్‌లో ఒకలా, కట్టింది మరోలా - 'మేడిగడ్డ' అంతా లోపాలమయం
బ్యారేజీ డ్యామేజ్‌కి కారణాలు చెప్పాలని ఎన్డీఎస్ఏ కమిటీని కోరినట్లు మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. వర్షాలు రాకముందే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. బ్యారేజీలను మరమ్మతులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కమిటీతో స్పష్టం చేసినట్లు తెలిపారు. బ్యారేజీని రిపేర్ చేసి అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి మంచిదేనని, వర్షాకాలంకు ముందే అందుబాటులోకి వస్తే మరీ మంచిదని మంత్రి అన్నారు.
రేపు ఎన్డీఎస్ఏ కమిటీ ఉదయం మేడిగడ్డ, అనంతరం అన్నారం, రాత్రి రామగుండం పర్యటించనున్నట్లు తెలిపారు. 8న సుందిళ్ల బ్యారేజీ పర్యటన ఉంటుందన్నారు. ఈఎన్సీ నాగేందర్ ఆధ్వర్యంలో అయ్యర్ కమిటీ పర్యటన ఉంటుందన్నారు. ఎల్ అండ్ టీ రాష్ట్రంలో అనేక వ్యాపారాలు చేస్తోందని, నిర్మాణ సంస్థకు భాధ్యత ఉండాలన్నారు. జుడిష్యల్ ఎంక్వైరీపై త్వరలోనే ముందడుగు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
"ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ఎన్డీఎస్ఏ కమిటీకి ఇవ్వాలని కోరుతున్నాం. ఎవరైనా ఎన్డీఎస్ఏ కమిటీకి సహకారం ఇవ్వకపోతే, డాక్యుమెంట్స్ దాచితే కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రాజెక్టులపై టెస్టుల కోసం ప్రపంచంలో ఎంత అత్యాధునిక టెక్నాలజీ వాడాలని సూచించాం. ఈఎన్సీ నాగేందర్ ఆధ్వర్యంలో అయ్యర్ కమిటీ విజిట్ పూర్తి చేసుకుంటుంది. ఎన్డీఎస్ఏ ప్రాథమిక రిపోర్ట్ రాగానే తప్పులు ఉంటే నిర్మాణ సంస్థ పై చర్యలు తీసుకుంటాం". - ఉత్తమ్, మంత్రి
సర్వే చేయకుండా మేడిగడ్డ ప్రాజెక్టు కట్టడం అతిపెద్ద తప్పు : కేంద్ర జల్ శక్తి మంత్రి సలహాదారు