ETV Bharat / state

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరవైంది - కూటమి పార్టీల మహిళా నేతలు - NDA Women Leaders fires on ysrcp - NDA WOMEN LEADERS FIRES ON YSRCP

NDA Women Leaders Fires on YSRCP: వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరవైందని, వారి సంక్షేమాన్ని సీఎం జగన్ తుంగలో తొక్కారని ఎన్డీఏ కూటమి పార్టీల మహిళా నేతలు మండిపడ్డారు. జగన్​పై గులకరాయి వేసినందుకు వైసీపీ నేతలకు కడుపు మండితే, మహిళలతో పాటు అన్ని వర్గాల వారిని ఐదేళ్లుగా నరకం చూపిస్తున్న ప్రభుత్వంపై వారికి ఎంత మండాలని జనసేన అధికార ప్రతినిధి కీర్తన ప్రశ్నించారు. మహిళల కష్టాన్ని మద్యం రూపంలో కొల్లగొట్టి వైసీపీ జోబులు నింపుకుంటుందని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామని విమర్శించారు.

NDA_Women_Leaders_Fires_on_YSRCP
NDA_Women_Leaders_Fires_on_YSRCP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 5:30 PM IST

NDA Women Leaders Fires on YSRCP: వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరవైందని, వారి సంక్షేమాన్ని జగన్ తుంగలో తొక్కారని ఎన్డీఏ కూటమి పార్టీల మహిళా నేతలు మండిపడ్డారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మూడు పార్టీల నేతలు మాట్లాడారు. జగన్​పై గులకరాయి వేసినందుకు వైసీపీ నేతలకు కడుపు మండితే, మహిళలతో పాటు అన్ని వర్గాల వారిని ఐదేళ్లుగా నరకం చూపిస్తున్న ప్రభుత్వంపై వారికి ఎంత మండాలని జనసేన అధికార ప్రతినిధి కీర్తన ప్రశ్నించారు.

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరవైంది - కూటమి పార్టీల మహిళా నేతలు

రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నాయని, మహిళలపై దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయని మండిపడ్డారు. బటన్ నొక్కుడు పేరుతో మోసం చేస్తున్న జగన్​కు మహిళలు బటన్ నొక్కి వైసీపికి బుద్ధి చెప్పబోతున్నారని హెచ్ఛరించారు. బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన గురించి చెప్పాలంటే తెలుగులో అక్షరాలు సరిపోవన్నారు. మహిళల కష్టాన్ని మద్యం రూపంలో కొల్లగొట్టి వైసీపీ జేబులు నింపుకుంటోందని విమర్శించారు. మహిళలపై అరాచకాలపై మహిళా మంత్రులు మాట్లాడరా అని ప్రశ్నించారు.

టీడీపీ రాష్ట్ర నాయకురాలు ఆచంట సునీత మాట్లాడుతూ నవరత్నాల్లో మొదటి రత్నం మద్యపాన నిషేదం ఏమైందని జగన్​ను ప్రశ్నించారు. జగన్ పాలనలో మహిళా హోంమంత్రి రబ్బర్ స్టాంపుగా మారారని, మహిళా కమిషన్ సైతం కేవలం బాధితులకు పరిహారం చెక్కులు ఇవ్వటానికే ఉన్నారని ఎద్దేవా చేశారు. జగన్​కు భయపడి ఆయన తల్లి అమెరికా పారిపోయారని, సొంత చెల్లెల్లు కొంగుచాచి న్యాయం అడుగుతున్నారని, మహిళా సంక్షేమంలో వైసీపీ విఫలమైంది అనేందుకు ఇవన్నీ నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

జగన్ అరాచక పాలనపై పాటలు విడుదల చేసిన తెలంగాణ టీడీపీ నేతలు - TDP Released Songs

"సీఎం జగన్ మోహన్ రెడ్డికి జనసేన వీరమహిళగా ఒకటే సవాల్ విసురుతున్నాం. నిజంగా మీకు ఏ విషయంపై కోపం రావాలి, రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు మిస్ అవుతున్నందుకా? అమ్మఒడి పేరుతో డబ్బులు ఇచ్చి, నాన్న బుడ్డీ పేరుతో లాక్కుంటున్నందుకా? చట్టాలను అమలు చేయనందుకా?." - కీర్తన, జనసేన అధికార ప్రతినిధి

"అ అంటే అఘాయిత్యాలు, అరాచకాలు. ఆ అంటే ఆగని దాడులు. ఇ అంటే ఇంటింటా అభద్రత. ఈ అంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టాలు అనేవి ఉన్నాయా. ఇలా చెప్పుకుంటే పోతే, వైసీపీ చేస్తున్న నియంతృత్వ, అవినీతి పరిపాలన గురించి చెప్పుకోవడానికి తెలుగులో ఉన్న అక్షరాలు అన్నీ సరిపోవు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదు. ఉపాధి లేదు. ఈరోజు రాష్ట్రంలో మహిళలను ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుదామని వస్తున్నారో జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి". - సాధినేని యామిని, బీజేపీ అధికార ప్రతినిధి

"అభివృధ్ధి, సంక్షేమ విజనరీ మన చంద్రన్న" - టి.డి.జనార్దన్‌ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు - Chandrababu Book Launch

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.