NDA Government Will Introduce State Full Budget in November Month : రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను నవంబర్ 11న శాసనసభలో ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయార్జాన, బడ్జెట్ స్వరూపం, ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ , ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఆదాయార్జాన శాఖ అధికారులు హాజరయ్యారు.
నవంబరు రెండో వారంలో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్! - ‘సూపర్ సిక్స్’పై కసరత్తు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రవేశపెట్టిన శ్వేతపత్రం ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని అంశాలను సమీక్షించినట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) రాష్ట్ర రెవెన్యూ రూ.1,73,766 కోట్ల వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల ఆదాయం సాధించగలమా? ఇంతవరకు రాబడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అని సీఎం ప్రశ్నించారు.
మళ్లీ ఏపీలో ఎన్నికల సందడి - ఓటర్లుగా పేర్లు ఇలా రిజిస్టర్ చేసుకోండి
కొత్త విధానాల వల్ల, తీసుకోబోయే నిర్ణయాల వల్ల రాబడిపై ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశాలను ఎక్సైజ్,వాణిజ్య పన్నులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుత పరిస్థితిపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. వచ్చే 5 నెలల్లో రాష్ట్ర అవసరాలేంటి? సంక్షేమ పథకాల తాజా పరిస్థితులు, ప్రభుత్వ ప్రాధాన్యాలు, సంబంధిత కార్యక్రమాలు పూర్తి చేసేందుకు ఉన్న లోటును ఎలా పూడ్చుకోవాలనే లాంటి అంశాలపై చర్చ జరిగింది. పెండింగ్ బిల్లుల తాజా పరిస్థితులపైనా సీఎం అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అమరావతికి రూ.15000 కోట్లు- పూర్తి బాధ్యత కేంద్రానిదే! - World Bank Loan to Amaravati