Native Araku Coffee Startup Gowing : అరకు కాఫీ అంటేనే ఓ బ్రాండ్. కాఫీ రైతుల కష్టాలే ఆయనలో ఆలోచనలు రేకెత్తించాయి. సాగుదారులకు అండగా నిలవాలన్న సంకల్పంతో అడుగులు ముందుకేశారు. ఐటీ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకుని అంకుర సంస్థకు బీజం వేశారు. కాఫీతోపాటు చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు పొట్టుతోనూ సౌందర్య ఉత్పత్తులు, గ్లాసులు తయారు చేస్తున్నారు. కాఫీ రుచులను ఖండాతరాలు దాటిస్తున్న 'నేటివ్ అరకు కాఫీ స్టార్టప్' ప్రస్థానం ఇది.
రామ్‌కుమార్ వర్మ అనే వ్యక్తి ఆరేళ్ల కిందట విశాఖ కేంద్రంగా 'నేటివ్ అరకు కాఫీ' స్టార్టప్‌ను ప్రారంభించారు. కాఫీ గింజలను కొని దళారుల ప్రమేయం లేకుండా వాటిని ఎగుమతి చేసి రైతులకు మంచి ఆదాయం కల్పించేలా కృషి చేస్తున్నారు. ఐబీఎమ్ (IBM) ఐటీ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజరుగా పని చేసిన రామ్‌కుమార్ వర్మ లక్షల్లో జీతాన్ని వదులుకుని కాఫీ బిజినెస్ చేయడానికి గల కారణాలేంటో తెలుసుందాం.
ఐడియా అదుర్స్ - హైడ్రోజన్‌తో నడిచే హైబ్రిడ్ స్కూటీ ఆవిష్కరణ - Hybrid Bike Runs with Hydrogen
'నేను కాఫీ ప్రియుడ్ని. 2017లో అరకు వెళ్లినప్పుడు కాఫీ తాగుతూ ఆ రైతును దాని గురించి అడిగాను. చెప్తే మీరేం చెయ్యగలరన్నారాయన. వారికి సహాయం చెయ్యాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అతడి దగ్గర కాఫీ సాగు గురించి తెలుకున్న వారం రోజుల తర్వాత మళ్లీ వస్తానని చెప్పాను. వాళ్ల పరిస్థితులు చూసి చలించిపోయాను. మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతులతో వ్యాపారం చెయ్యాలనుకున్నా. ఇప్పుడు విజయవంతంగా రైతులు లాభాలు చూడగలిగేలా చేశా. ఇక ముందు 'నేటివ్ అరకు కాఫీ' ని మరింత అభివృద్ధి చేస్తాం.' - రామ్ కుమార్‌వర్మ, నేటివ్ అరకు కాఫీ యజమాని
ఫిల్టర్ కాఫీతో మొదలైన వ్యాపారం క్రమంగా విస్తరిస్తోంది. సరికొత్తగా హనీ కాఫీని తీసుకొచ్చి పేటెంట్ హక్కులూ పొందారు. కాఫీ గింజలతో చాక్లెట్లు, లాలీపాప్‌లు, ఐస్‌క్రీమ్‌లు, కాస్మొటిక్స్ బై ప్రొడక్ట్‌నును రూపొందించి లాభాలు ఆర్జిస్తున్నారు. ఎనిమిది రైతు ఉత్పత్తిదారుల సంఘాల పరిధిలోని 10 వేలమంది రైతులు నేటివ్ అరకు కాఫీ స్టార్టప్‌తో ఒప్పందం చేసుకున్నారు. కాఫీతోపాటు బై ప్రొడక్ట్‌లోనూ రైతులకు వాటా కల్పించేలా పని చేస్తున్నారు రామ్ కుమార్ వర్మ. కాఫీ ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు అందించేలా త్వరలోనే 'కాఫీ ఆన్ వీల్స్'ను తీసుకొచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.
పట్టు విడవని ముగ్గురు మిత్రులు - ఏడాదికి 70 లక్షల బిజినెస్ - KUSALA HONEY FARMING