Global Forum Conference in Visakha : విశాఖలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ ఫర్మేషన్ నేతృత్వంలో "నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్" సదస్సు జరిగింది. సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా పాల్గొని ఈ సదస్సును ప్రారంభించారు. షేపింగ్ ది నెక్ట్స్ ఎరా ఆఫ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ తో సదస్సు ఏర్పాటు చేయగా వివిధ అంశాలపై 5 సెషన్లుగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలతో మెరుగైన పాలన అందించడం, ప్రజల తలసరి ఆదాయం పెంచడం వంటి అంశాలు సదస్సు ప్రధాన అజెండా సాగింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. మొదట్లో ఇన్ఫర్మషన్ టెక్నాలజీ కోసం ఎవ్వరూ మాట్లాడేవారు కాదని, ఆ సమయంలో హైటెక్ సిటీ, హైటెక్ టవర్స్ నిర్మించామని తెలిపారు. రంగారెడ్డి జిలాలో ఒక్కప్పుడు 20 హైస్కూళ్లు ఉంటే నేడు 200 ఇంజినీరింగ్ కాలేజ్‌లు వచ్చాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్ గా చేయడానికి అందరూ అడుగులు కలపాలని పిలుపునిచ్చారు. 15% జీడీపీ పెరగాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, దేశ జీడీపీ 8 శాతం ఉంటే ఆంధ్ర ప్రదేశ్ 8.7 శాతం అభివృద్ధి ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఒక్కప్పుడు అధిక జనాభా వల్ల నష్టాలు ఉంటాయని భావించామని, కానీ, ఇప్పుడు అదే మన ఆస్తి అని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు జనాభా తక్కువ సమస్య ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు మన భారతీయుడని తెలిపారు. పేదరిక నిర్మూలన లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్తూ జనాభా- టెక్నాలజీ రెండూ అవసరమన్నారు. "ఫోర్ పి" నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. విశాఖ నగరం భవిష్యత్ నాలెడ్జి హబ్ అంటున్నారని, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రక్షిత తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు నీరు అందిస్తున్నామన్నారు.
జీరో బడ్జెట్ నేచురల్ ఫ్రామింగ్ డెవెలప్ మెంట్ నినాదంతో వెళ్తున్నామన్నారు. వెయ్యి కిలోమీటర్లు తీరం ఉందని, సముద్ర రవాణా మీద బాగా దృష్టి పెట్టామని వెల్లడించారు. లాజిస్టిక్ కార్గో కేవలం 14 % ఉందన్నారు. మన రాష్ట్రమే మొదటి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిందని, పవర్ సెక్టార్ లో రాష్ట్రం మంచి అభివృద్ధి సాధించిందని తెలిపారు. త్వరలో గ్రీన్ హైడ్రోజన్ కూడా మన రాష్ట్రం నుంచి ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా విశాఖ డీప్ టెక్ సదస్సులో స్వర్ణాంధ్ర ట్రాన్స్ఫామేషన్ ఇండియా టూ వికసిత భారత్, ఏ ఐ ఫర్ ఎవ్రీ వన్ అనే రెండు పుస్తకాలను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఇకపై MSMEలు! వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్ప్రెన్యూర్పై సీఎం సమీక్ష
అమరావతికి కొత్త కళ - రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులు
'కఠిన నిర్ణయాలు తీసుకోవాలి' - సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్