Actress Jathwani and her Family met Vijayawada CP: ముంబయి నటి కాదంబరీ జత్వానీ ఆమె కుటుంబసభ్యులు మరోసారి విజయవాడ సీపీ కార్యాలయానికి వచ్చారు. న్యాయవాదితో కలిసి సీపీ కార్యాలయానికి వచ్చిన నటి జత్వానీ కుటుంబసభ్యులు స్టేట్‌మెంట్ ఇచ్చారు. నటి కుటుంబసభ్యుల స్టేట్ మెంట్‌ని పోలీసులు రికార్డు చేశారు. కాగా వైఎస్సార్సీపీ హయాంలో వేధింపులు, అక్రమ కేసుపై నటి జత్వానీ శుక్రవారం సీపీ ఎదుట వాంగ్మూలమిచ్చారు. శనివారం ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. అనంతరం పలు విషయాలు మీడియాకు ఆమె వెల్లడించారు.
నా కుటుంబసభ్యులు వాంగ్మూలం ఇచ్చారు. రెండ్రోజులపాటు ఎంతో ఓపికతో పోలీసులు మా వాంగ్మూలాలు రికార్డు చేశారు. మాకు న్యాయం జరుగుతుందని అధికారులు చెప్పారు. సీఎం, హోంమంత్రి కొండంత ధైర్యం ఇచ్చారు.. వారికి ధన్యవాదాలు. గతంలో విజయవాడ నుంచి 15 మంది పోలీసుల బృందం ముంబయి వచ్చింది. విద్యాసాగర్ చెబుతున్న హనీట్రాప్ ఆరోపణలు అవాస్తవం. భూమి కొనేందుకు వచ్చారన్న వ్యక్తి విద్యాసాగర్‌పై ఫిర్యాదు చేశారు. మా ఆధార్ కార్డులు దుర్వినియోగం చేశారు. ముంబయి కేసును మూయించేందుకే ఈ కేసును తెరపైకి తెచ్చారు. అప్పటి సీపీ కాంతిరాణా దీన్ని నడిపించారు. దీనిలో విశాల్ గున్ని, పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక చాలా పెద్ద కుట్ర జరిగింది. - ముంబయి నటి