ETV Bharat / state

YUVA- వరల్డ్‌ ఛాంపియన్​కు కరవైన ప్రోత్సాహం - అవకాశాలొస్తున్నా అడ్డొస్తున్న ఆర్థిక స్థోమత - Yuva on Warangal Bodybuilder

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 1:20 PM IST

Updated : Aug 3, 2024, 1:27 PM IST

World Champion Bodybuilder Yuva Story : ఆ యువకుడికి ఒకటే ధ్యాస. దేశం పేరు నిలబెట్టాలి. పతకాలు కొల్లగొట్టాలని, అందుకోసం కుటుంబాన్ని వదిలి ఏళ్ల తరబడి సాధన చేశాడు. ఆశించినట్టుగానే ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో అద్భుత ప్రతిభతో ఆహా అనిపించిన ఆ క్రీడాకారుడు ఇప్పుడు కుటుంబ పోషణే కష్టం కావడంతో క్రమంగా పోటీలకు దూరమవుతున్నాడు. ఆసరాగా నిలిస్తే పతకాల వేట కొనసాగిస్తానంటున్న బాడీబిల్డింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ రామకృష్ణపై ప్రత్యేక కథనం.

Bodybuilder From Warangal looking For Sponsors
World Champion Bodybuilder Yuva Story (ETV Bharat)

Bodybuilder From Warangal looking For Sponsors : బంగారానికైనా సానపెట్టనిదే వన్నెరాదు. క్రీడాకారులైనా అంతే. తగిన సాయం లభిస్తేనే విజేతలుగా నిలిచి దేశానికి పేరు తెస్తారు. కొందరైతే తలకు మించిన భారమైనా ఆటపై ఇష్టంతో సొంత ఖర్చులతో పోటీలకు వెళ్తుంటారు. అలాంటి వారిలో ఇతడూ ఒకరు. స్వశక్తితో బాడీ బిల్డింగ్‌లో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ సాధించిన తనకి తర్వాత ప్రోత్సాహం అందించేవారే కరవు అయ్యారు. అవకాశాలొస్తున్నా నిస్సహాయత వెంటాడుతోందని ఆవేదన చెందుతున్నాడు ఈ బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌.

హన్మకొండ జిల్లా కాజీపేట దర్గాకు చెందిన రామకృష్ణ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు ఏదోకటి చేయాలనుకున్నాడు. దేహదారుఢ్యంపై ఆసక్తి పెంచుకుని కండలు పెంచేందుకు కఠోరంగా శ్రమించాడు. ఫిట్‌నెస్ పోటీల్లో నిరూపించుకోవాలని, మెరుగైన శిక్షణ కోసం సొంతూరి నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. తొలి పోటీలోనే పతకం దక్కడంతో మరింత కష్టపడ్డాడు. తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. పాల్గొన్న ప్రతి పోటీలో పతకాలు కొల్లగొడుతూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు.

'చిన్నప్పటి నుంచి ఫిట్​నెస్​ అంటే నాకు ఇష్టం. ఫస్ట్​టైం వరల్డ్​ ఛాంపియన్​షిప్​ 2017లో చేశా. అప్పడు బెస్ట్​ ఆఫ్​ టెన్​లో కూడా అవకాశం రాలేదు. దీంతో 2018లో ఇంటర్నేషనల్​ కోచ్​ దగ్గర ట్రైనింగ్​ తీసుకున్నా. సౌత్​ కొరియాలో పోటీలో పాల్గొని బ్రాంజ్​ మెడల్​ సాధించా'- రామకృష్ణ, అంతర్జాతీయ బాడీబిల్డర్‌

మిస్టర్ స్టీల్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ : నెలకు 3, 4 పోటీల్లో పాల్గొంటూ కండల వీరుడిగా లెక్కకు మించి టైటిల్స్‌ కైవసం చేసుకున్నాడు రామకృష్ణ. అందుకు నిదర్శనంగా ఈయన ఇంట్లో ఎక్కడ చూసినా పోటీల్లో గెలుపొందిన కప్పులూ, మెమొంటోలే దర్శనమిస్తాయ్‌. 2022, 2023ల్లో వరసగా ఆల్ ఇండియా రైల్వేస్ బాడీ బిల్డింగ్‌ ఛాంపియన్‌గా నిలిచి అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. 2021 ఉజ్బెకిస్థాన్‌లో మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్‌ ఛాంపియన్‌గా, 2019లో దక్షిణ కొరియాలో వెండి పతకం, మిస్టర్ సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌ ఓవరాల్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. అదే ఏడాదే మిస్టర్ స్టీల్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ కూడా సాధించి అదరహో అనిపించాడు.

స్పాన్సర్లు అండగా ఉండాలని : అంతర్జాతీయ స్థాయిలో పతకాలు తెస్తున్నా ఈ బాడీబిల్డర్‌కు ఆర్థిక అండనిచ్చేవారే కరవయ్యారు. ఇప్పటివరకూ పోటీలకు వెళ్లేందుకు రూ.70 లక్షలు వెచ్చించానని అంటున్నాడు రామకృష్ణ. స్పాన్సర్లు లేక నవంబరులో మాల్దీవుల్లో జరిగే పోటీలకు వెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రైల్వే ఉద్యోగిగా సంపాదన రూ. 40 వేలలోపే కావడంతో డైట్‌ కొనసాగించలేక, కుటుంబ పోషణకు సరిపోక మమ్మల్ని ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయని అంటోంది రామకృష్ణ భార్య. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి తమకు సహకరించాలని వేడుకుంటోంది.

ప్రపంచ ఛాంపియన్‌ సహా ఎన్నో పతకాలు సాధించి దేశఖ్యాతిని ఇనుమడింజేశాడు ఈ బాడీ బిల్డర్‌. ఇప్పుడు స్థోమత లేక, అవకాశాలొస్తున్నా వెళ్లలేక తల్లడిల్లిపోతున్నాడు. స్పాన్సర్లు అండగా నిలిస్తే పోటీల్లో సత్తాచాటాలనే పట్టుదలతో ఉన్నాడు రామకృష్ణ.

YUVA : చెక్క ట్రెడ్‌మిల్‌తో - కరెంటు బిల్లు మాయం - ఫిట్​నెస్ మాత్రం ఖాయం - WARANGAL MAN MAKES WOODEN TREADMILL

YUVA : సంకల్పం ముందు - వైకల్యం ఓడింది - ఈయన ఓ తరానికి ఇన్​స్పిరేషన్ - Disabled Man Inspiring Story

Last Updated : Aug 3, 2024, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.